మాన దేశ ప్రధానికి పరిపాలన చేతకావడం లేదు. ప్రతీది ప్రైవేటు పరంచేసి, తప్పు ఒప్పులను ప్రైవేటు వాళ్ళ మీద వేసి, కేవలం కర్ర పెత్తనం చేయాలని చూస్తున్నారు. మొన్నటివారు విశాక స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తాను అని ఆంధ్రప్రదేశ్ మీద కత్తి కట్టారు. ఇప్పుడు తిరుపతిని అమ్మకానికి పెట్టాలని మరో కత్తి కట్టారు.
పొతే చిన్న సవరణ. తిరుపతి అంటే మొత్తం తిరుమల నగరం కాదు. తిరుపతికి గుండె లాంటి తిరుపతి ఎయిర్ పోర్ట్ ని ప్రైవేటు వాళ్ళకు అమ్మాలని రంగం సిద్దమయింది. దీని మీద కసరత్తు చేయాలనీ ప్రధాని విమానయ శాఖను ఆదేశించారు. టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు.
తిరుపతికి ఆదాయం వనరులు రెండే రెండు. ఒకటి తిరుపతి హుండీ ఆదాయం. రెందోవది ఎయిర్ పోర్ట్ ఆదాయం. సాధారణ రోజుల్లో రెండు వేల మంది విమానంలో దేశ, విదేశాల నుంచి తిరుపతికి వస్తారు. వేసవి సెలవుల్లో రోజుకు మూడు వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. ఇక బ్రమ్మోస్తావాల సమయంలో లెక్కలేదు. ఏటా రూ.200 కోట్లపైనే లాభాలు ఆర్జిస్తున్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం ఎందుకు అమ్మాలని చూస్తోందో మనకే కాదు, ఆ ఏడుకొండల వాడికి కూడా అర్థం కావడంలేదు. ఆంధ్రప్రదేశ్లో మంచి లాభాలతో, వేలాదిమంది ప్రయాణికులతో కళకళలాడుతూ రద్దీగా ఉంది, నాలుగు విమానాలు ఎగిరే ఎయిర్ పోర్ట్ తిరుపతి విమానాశ్రయం ఒక్కటే. దానిని కూడా గద్దలా మోడీ తన్నుకుపోవాలని చూస్తున్నారు.
అయితే ఈ ఎయిర్ పోర్ట్ ని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కువైట్ నుంచి తిరుపతికి విమానాలు నడపడానికి ప్రణాళిక సిద్ధమైంది. త్వరలోనే ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా అవతరించబోతోంది. ఇంతలోనే కేంద్రం అమ్మకానికి పెట్టడంతో రాజకీయ కుట్ర దాగి ఉందని జగన్ సర్కార్ కన్నెర చేస్తోంది. కానీ దీనిని అడ్డుకునే గొంతుక జగన్ కు లేదు. అతనికి ఉన్న బొక్కకు అతనికి ఉన్నాయి. మోడీకి ఉన్న లెక్కలు మోడీకి ఉన్నాయి.
ఒక్క తిరుపతి విమానాశ్రయమే కాకుండా ఏపీలో విజయవాడ, గన్నవరం ఎయిర్ పోర్ట్ కు కూడా కన్నం కొడుతూ ప్రైవేటుపరం చేయాలనీ మోడీ ఆలోచన. దీనికితోడూ రాజమండ్రి విమానాశ్రయాలను కూడా కేంద్రం ప్రైవేటీకరించనుంది.
ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తాజాగా ఓ ప్రకటన అధికారికంగా వెల్లడించారు. ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయానికి కనీసం టెండర్లను కూడా పిలవకుండానే విక్రయించడానికి కేంద్రం సిద్ధమైందని సమాచారం. దీనినే అచ్చ తెలుగు చెప్పాలంటే ‘అత్తా సొమ్ము అల్లుడు దానం చేయడం’ లాంటిది.
ఇప్పటికే తిరుపతి ఎయిర్ పోర్టును మీద జీఎంఆర్, టాటా, రిలయన్స్ డేగ కన్ను వేశాయి. వీటిని తమకు ఇవ్వాలని మోడీ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ మూడింటిలో రిలయన్స్ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ విమానాశ్రయాన్ని చౌకగా దక్కించుకొని దీనిపక్కనే ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా దక్కించుకోవాలనే ప్రయత్నాలు రిలయన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడు వందల ఎకరాల్లో ఫైవ్ స్టార్ హోట్టల్లు, మాల్స్, రెస్టారెంట్లు నిర్మించే ప్రణాళికల్లో రిలయన్స్ ఉందని తెలుస్తోంది.