మనకు మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు రెండు పక్కపక్క నే ఉంటాయి. కానీ అవి కలవవు. కాలవకూడదు కూడా. మన దేశ రాజకీయం ఎప్పుడో డ్రైనేజీ పైపుల్లా మారింది. మన దేశంలో న్యాయవ్యవస్థ మంచినీటి పైపులా ఇంకా పవిత్రంగా ఉన్నది. మన దేశంలో అన్ని రంగాలు కలుషితమయినప్పటికి న్యాయవ్యవస్థ ఒక్కటి ఇంకా కలుషితం కాలేదు. అందుకే మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ప్రతేక్య ఎస్టేట్ హోదా నిచ్చింది.
ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఈ రెండు పైపులను కలపాలని చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి తమ పబ్బం గడుపుకోడానికి న్యాయవ్యవస్థకు పదవుల ఎరను చూపుతోంది. అంటే ఇకపై బిజిపి ప్రభుత్వానికి జడ్జీలు అనుకూలంగా ఉంటే మీ పదవీ విరమణ తర్వాత గవర్నర్, ఎం పి లాంటి పదవులు ఇస్తాము అనే సందేశాన్ని పరోక్షంగా పంపుతున్నారు.
ఈ మిషన్ ను బి జె పి చాపకింద నీరులా ఎప్పుడో ప్రవేశపెట్టింది. 2014 లో దేశ ప్రధానిగా మారిన మోడీ దీనికి తెరలేపారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాముర్తిగా పదవి విరమణ చేసిన జస్టిస్ సదాశివంనీ కేరళా గవర్నర్ గా నియమించారు. ఇది ఎలాంటిదంటే పోలీస్ కమిషనర్ పదవి విరమణ చేసిన వాడు ఏటిఎం మిషన్ ముందు వాచ్ మెన్ ఉద్యోగం చేసినట్లు. సోషల్ మీడియా, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. చెవిటి వాడి ముందు శకం ఉదినట్లు మోడీ పట్టించుకోలేదు. అయన దవడ గడ్డంతో పాటు చెవిలో కూడా గెడ్డం పెంచారు. జడ్జీలను తన వైపుకు తిప్పుకోవడం కావాలి. అంతే!
అక్కడితో మోడీ ఆగలేదు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పదవి విరమణ చేయగానే బిజెపిలోకి లాక్కుని రాజ్య సభసభ్యుడిగా మార్చారు. మరోసారి మీడియా, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. చెవిటి వాడి ముందు శకం ఉదినట్లు మోడీ పట్టించుకోలేదు. అయన దవడ గడ్డంతో పాటు చెవిలో కూడా గెడ్డం పెంచారు. జడ్జీలను తన వైపుకు తిప్పుకోవడం కావాలి. అంతే!
అప్పటికే ఆ సంకేతాలు జడ్జిలకు చేరాయి. పదవి విరమణ చేసాకా ఏం చేయాలో తోచని కొందరు జడ్జీలు బిజెపికి అభిమానులుగా మారారు. అందులో కర్నాటకకు చెందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి సయ్యద్ అద్బుల్ నజీర్ ఒకరు. అందుకే అతను రామజన్మ భూమి కోర్ట్ వివాదంలో కీలక పాత్ర వహించి బిజెపికి అనుకూలంగా మారారు. అయన ఆశించినట్లే పదవి విరమణ కాగానే నేడు ఏపీ గవర్నర్ గా పదవి లభించింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియా, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. చెవిటి వాడి ముందు శకం ఉదినట్లు మోడీ పట్టించుకోలేదు. అయన దవడ గడ్డంతో పాటు చెవిలో కూడా గెడ్డం పెంచారు. జడ్జీలను తన వైపుకు తిప్పుకోవడం కావాలి. అంతే!
బిజెపి చేపట్టతే ఇలాంటి అనైతిక చర్యలు దేశ భవిష్య త్తుకు గొడ్డలిపెట్టు లాంటివని మేధావి వర్గం బాధపడుతోంది.