తన గురించి, పార్టీ మారడం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పుతో కొడతానని ఎంపీ అరవింద్ ను హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఖర్గేతో మాట్లాడాననేది శుద్ధ తప్పు అని వివరణ ఇచ్చారు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో తానెలా చేరుతానని ప్రశ్నించారు. తన జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్. తన రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనేనని వివరించారు కవిత.
చెప్పుతో కొడుతా – ఎంపీ అరవింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్
పార్లమెంటులో అరవింద్ పనితనం సున్నా అని వివరించారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని ఆగ్రహించారు. అరవింద్ ది ఫేక్ డిగ్రీ.. దీనిపై తాను రాజస్థాన్ యూనివర్సిటీ కి ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. అరవింద్ బురద లాంటోడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడారని మండిపడ్డారు.అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోందన్నారు. తాను సమస్యల మీద మాట్లాడతాను.. వ్యక్తుల ఎపుడూ మీద మాట్లాడలేదు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడంలేదన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు – ఆమె అరెస్ట్ తప్పదా..?
తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని తెలిపారు కవిత. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడంపై మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో షిండే మోడల్ నడవదన్నారు. జై మోడీ అన్న వారి పైన ఈడీ దాడులు ఉండవని… ఈడీ, ఐటీ, సీబీఐ మోడీ అల్లుళ్లు అని లాలూ యాదవ్ ఎపుడో చెప్పారని గుర్తు చేశారు కవిత. ఈడీ దాడులకు భయపడమన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వెళతామని స్పష్టం చేశారు. అరవింద్ కాంగ్రెస్ నేతలతో ఏం పని. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కు పని చేస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్తో కుమ్మకై తన మీద గెలిచారు.’’ అని కవిత మండిపడ్డారు.