‘తాంబూలాలు ఇచ్చాము, ఇక తన్నుకు చావండి’ అన్నట్లు కేంద్ర ఎన్నకల సంఘం తెలంగాణ ఎమ్మెల్సి ఎన్నికల తాంబూలాలు ఇచ్చింది. ఏమ్మెల్లె కోటాలో 3, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ లోకల్ బాడీస్, టీచర్స్ ఎమ్మెల్సి స్టానాలకు ఈ గురువారంలో నామినేషన్ల గడువు ముగుస్తోంది. దాని తర్వాత వెంటనే ఈ ఐదు ఎమ్మెల్సి ఎన్నికలు ఇసి నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అయితే ఇది బిఆర్ఎస్ కి కొత్త కాదు. పొతే మొన్నటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. బరువుతో పాటు బాధ్యతలు కూడా ఎక్కవే.
లోగడ ఏమ్మెల్లె టికెట్లు దక్కని రెబల్స్ ని ‘ఎమ్మెల్సి’ టికెట్ ఇస్తానులే అని కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు ఎవరికి వారుగా మాటిచ్చి బుజ్జగించారు. ఎవరికి వారుగా కనీసం 40 మందికి మాట ఇచ్చారు. అంటే మొత్తం 40 ఇంటు ౩ = 120 కౌరవుల కంటే ఎక్కువ టీం రెడీగా ఉన్నది. ఇక్కడ ఉన్నవి మాత్రం పాండవుల లాగ ఐదు సీట్లు మాత్రమే. మరి కౌరవులలోంచి పాండవులుగా మరేది ఎవరో వేచిచూడాలి. ఒకవేళ తేడాలు వస్తే ఆదిలోనే హంసపాదు అన్నట్లు బిఆర్ఎస్ కి తిరుగుబాటు దారుల నుంచి ముప్పు తప్పేలా లేదు. ఈ పలితాలు రానున్న అసంబ్లీ ఎన్నికలకు ట్రయిలర్ లాంటిది అని అందరికీ తెలుసు. దీనికి మించి గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సి ఎన్నికలు మరింత కీలకం కానున్నాయి.