అప్పట్లో ఏపీ గవర్నర్ గా చేసిన తివారీ తన తండ్రి అని ఓ వ్యక్తి పోరాడిన సంగతి తెలిసిందే. అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో డీఎన్ఏ టెస్టు కీలకమైంది. దాంట్లో వీరిద్దరూ తండ్రికొడుకులని తేలడంతో..ఆ తరువాత అతను తన కొడుకేనని తివారీ అంగీకరించాడు. ఇప్పుడు అదే తరహలో వైసీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.
ఆయన ఎవరో కాదు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తన తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని శివచరణ్ రెడ్డి అనే యువకుడు లేఖ ద్వారా మీడియాకు సమాచారం అందించాడు. అతను కేవలం లేఖతో సరిపెట్టలేదు. బాల్యంలో చంద్రశేఖర్ రెడ్డి తమ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను చూపించారు. తండ్రిలాగా నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలను పంపారు. తన తల్లి అనంతరం ఆయన లైఫ్ లోకి వచ్చిన మహిళలకు చంద్రశేఖర్ గుర్తింపు ఇచ్చారు కాని, తమకు ఆ గుర్తింపు ఇవ్వడం లేదని ఆ యువకుడు చెబుతున్నాడు. ఈ వ్యవహారం మేకపాటి ఫ్యామిలీలో కలకలం రేపుతోంది.
మేకపాటికి ఉమనైజర్ అనే పేరుంది. ఆయనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. ఇద్దరు భార్యలు తమ వారసుల్ని ఉదయగిరి నియోజకవర్గానికి వారసులుగా చేయాలని ఆరాటపడుతున్నారు. ఆయన రెండో భార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటుంటారు. ఈ ఇద్దరు భార్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే మధ్యలో శివచరణ్ రెడ్డి ఎంటర్ కావడం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారింది.
Also Read : కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి.. చివరకు ఎంత పోగొట్టుకున్నాడంటే..!