మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తిని సీఎం కేసీఆర్ లైట్ తీసుకోవడానికి కారణం ఏంటి..? ఒకేసారి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైనా, వారిని కేసీఆర్ మందలించకపోవడం వెనకున్న కథేంటి..? తెలియాలంటే ఈ స్టొరీ చదవాల్సిందే.
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. జనరల్ గా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే పార్టీ హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. కాని మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీపై ప్రగతి భవన్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దాంతో ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వారంతా జట్టుగా తిరుమల వెళ్ళారు. అయినప్పటికీ హైకమాండ్ సైలెంట్ గానే ఉంది. ఎందుకంటే వారు హైకమాండ్ డైరక్షన్ లోనే మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ లోనే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్ళడమేనని అంటున్నారు.
ఇటీవల మల్లారెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండు రోజులు వరుసగా సోదాలు చేశారు. అయితే, మెడికల్ కాలేజ్ , ఇంజినీరింగ్ వ్యవహరాల్లో ఈడీని కూడా రంగంలోకి దిగాలని ఐటీ కోరింది. కాని ఇంతవరకు ఈడీ ఆ ప్రయత్నమే చేయలేదు. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్ళడంతోనే ఈడీ దాడులు ఆగిపోయాయని, బీజేపీలో చేరేందుకు మల్లారెడ్డి అంగీకరించినట్లు కేసీఆర్ కు తెలిసిందని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. అందుకే ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని పైగా ఆ అసంతృప్తిని ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.
బీజేపీతో మల్లారెడ్డి టచ్ లోకి వెళ్ళినట్లు కేసీఆర్ స్పష్టమైన సమాచారం అందితే వెంటనే, మల్లారెడ్డిని పదవి నుంచి కూడా తప్పించే అవకాశం కూడా ఉందంటున్నారు.