మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తనతో సెల్ఫీలు దిగేందుకు వస్తోన్న మహిళలను ఉద్దేశించి కేటీఆర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అంటేనే ప్రధాని విషం కక్కుతున్నారని మండిపడారు. తెలంగాణ ప్రజలంటేనే ప్రధాని దృష్టిలో ద్వితీయ శ్రేణి పౌరులు అనే చిన్నచూపు ఉందని విమర్శించారు.
అనంతరం దళిత బంధు యూనిట్లను పరిశీలించిన కేటీఆర్… లబ్దిదారులతో కలిసి భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. దళిత బంధుతో ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ దళిత బంధు పథకం అసలు లక్ష్యాన్ని అందుకోవాలన్నారు కేటీఆర్. దళితులు సొంత కాళ్ళపై నిలబడాలనే సదుద్దేశ్యంతోనే కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారని వివరించారు.
ఇదిలా ఉండగా కేటీఆర్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు వచ్చిన మంత్రి కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు మహిళలు పోటీ పడ్డారు. ఒకరెనుక ఒకరు రావడాన్ని గమనించిన కేటీఆర్ వారికీ కాదనుకుండా సెల్ఫీ ఇస్తూ తనతో సెల్ఫి దిగాలంటే ఒక్కొక్కరు రూ.500ఇవ్వాలంటూ సరదాగా అన్నడంతో అక్కడున్న మహిళలంతా నవ్వారు. మీతో సెల్ఫీ అంటే రూ.500ఏం కర్మ.. అంతకన్నా ఎక్కువే ఇస్తామంటూ చెప్తూ మహిళలు ముందుకు రావడం కనిపించింది.
అయినా కేటీఆర్ తో సెల్ఫీకి రూ.500నే… చీప్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం – లిక్కర్ స్కామ్ కేసు సంగతేంటి..?