టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సీనియర్ నటి మీనా రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో మీనాకు మరో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఇందుకోసం మీనాపై ఒత్తిడి తెచ్చారట.
కుటుంబ సభ్యులు మీనా వద్ద రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సెకండ్ మ్యారేజ్ కు మొదట ససేమీరా అందట. తను విద్యాసాగర్ ను మరిచిలేకపోతున్నానని చెప్పిందట. అయితే, నీకు రెండో పెళ్లి అవసరం లేకపోవచ్చును కాని, నీ కూతురికి తండ్రి అవసరముందంటూ మీనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కూతూరి భవిష్యత్ కోసం ఆలోచించమని మీనాను కుటుంబ సభ్యులు కోరగా ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకునేందుకు ఆలోచించి ఒకే చెప్పారని వార్తలు గుప్పుమంటున్నాయి.
2009లో విద్యా సాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 18న విద్యాసాగర్ మరణించారు. ఆయన మృతితో మీనా తోడు కోల్పోవడంతో ఆమెకు రెండో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మీనాకిచ్చి వివాహం చేస్తే వారి సంసారం జీవితం సాఫీగా ఉంటుందని భావిస్తున్నారట.
కూతురి ఫ్యూచర్ కోసం కుటుంబ సభ్యుల సూచన మేరకు రెండో పెళ్లికి మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది.