మానవ మనుగడలో గబ్బిలాలు పరోక్షంగా సాయం అందిస్తాయి. గబ్బిలాలు లేకపోతేఈ భూమ్మీద మనుషులకు తినేందుకు తిండి గింజలు కూడా కరువు అవుతాయి. అయితే.. వీటిలో అన్ని మంచి చేసేవే ఉండవు. హనీకరమైన గబ్బిలాలూ ఉంటాయి. ఆ గబ్బిలాలే ఇప్పుడు కొత్త వైరస్ ను మనుషుల మీదకు మోసుకోస్తున్నాయి. ఈ గబ్బిలాలు మోసుకోస్తోన్న ప్రాణాంతక వైరస్ తో చాలా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు తప్పదని ఇండియాను హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడనే లేదు. అప్పుడే మరో కొత్త వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది సూపర్ స్ప్రెడర్. కరోనా మహమ్మారిని మించిన మొనగాడి వైరస్. కరోనా నుంచి కోలుకోవాలంటే 14రోజులు క్వారంటైన్ లో ఉంటె సరిపోతుంది కానీ ఈ మార్ బర్గ్ సోకితే 21రోజులపాటు మన శరీరంలో జీవించి ఉంటూ మనుషులను జీవచ్చవంలా మారుస్తోంది. చావు అంచుల వరకు వెళ్ళేలా చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో 68శాతం మరణాల రేటు ఉందంటే ఈ మహమ్మారి ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఈ కంత్రీ వైరస్ ఆఫ్రికాలో వెలుగుచూసింది. గినియాలో ఈ మహమ్మారి వలన పదిమంది కన్నుమూశారు. ఇంకా వందలాది మంది మహమ్మారి బారిన పడి చావు- బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్ కు తరలించి పరీక్షలు చేయాలనీ ఆదేశించింది. ఏమాత్రం అలసత్వం వహించినా ఈ వైరస్ ప్రపంచాన్ని ఓ ఉపద్రవంలా కమ్మేస్తుందని.. అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఈ వైరస్ దెబ్బకు ఓ ప్రాంతాన్ని పూర్తిగా నిర్భంధించాల్సిన పరిస్థితి.
అనుమానితులను పరీక్షిస్తున్నట్లు గినియా సర్కార్ వెల్లడించింది. ఇటీవల ముగ్గురిలో మాత్రమే తేలికపాటి లక్షణాలు కనిపించాయని.. వైరస్ వేగం దృష్ట్యాకొన్ని చోట్ల లాక్ డౌన్ అమలు చేశారు. మరికొన్ని జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు చెప్పారు. రోజులు పెరుగుతున్నా కొద్దీ కేసులు పెరుగుతున్నాయి. నాలుగు వేల వరకు కేసుల సంఖ్యకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆఫ్రికాలోని కొంత ప్రాంతాన్ని మార్ బర్గ్ కమ్మేయడం ఖాయం. అనుమానితులను గుర్తించే ప్రాసెస్ ను స్పీడప్ చేయాలని whoఆదేశించింది.
ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తోంది. వాటి నుంచే మనుషులకు సోకుతుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని.. దగ్గరి సంబంధం పెట్టుకుంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో టైఫాయిడ్, మలేరియా వంటి లక్షణాలతో ఉంటుంది. ఆ తరువాత ఇదీ మార్ బర్గ్ అని అర్థం అవుతుంది. గ్రహించే లోపు జరగాల్సిన నష్టం జరుగుతంది. కాబట్టి ఈ వైరస్ పట్ల ఆఫ్రికా మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.