ఈ రోజు నుంచి శ్రీవారిని దర్శించుకునే టికెట్ కౌంటర్ లను తిరుమల తిరుపతి దేవస్తానం (టిటి డి) మార్చింది. గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఈ-టికెట్ల కౌంటర్ కు మార్చారు. ఇకనుంచి టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం దగ్గర ఉన్న కేంద్రంలో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన భక్తులు ఎవరైనా ఒకవేళ స్కాన్ చేసుకోకపోయితే, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి దర్శనానికి అనుమతించరు. ఇక యథా ప్రకారంగానే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లను అందజేయనున్నారు. ఈ టికెట్లను 1240వ మెట్టు వద్ద భక్తులకు అందించనున్నారు.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి తరలించారు. దీనివలన భక్తులకు మరింత సౌకర్యం ఉంటుదని అధిక్కరులు చెప్పారు.
మరోవైపు వేసవి సీజన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లను తగ్గించారు. అలాగే ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాట్లు చేశారు. ఈ వారంలో మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది.
ఇక సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లాలనుకునేవారికి, తిరుపతిలోనే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను జారీ చేస్తారు. ఆర్‌టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం, తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, గోవింద రాజ సత్రాల్లో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను పంపిణీ చేయనున్నారు.