కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి కట్ చేయడానికి రంగం సిద్దం చేయమని కాంగ్రెస్ హై కమాండ్ కసరత్తు చేస్తోంది. అతనిని కట్ చేయడానికి తెలంగాణ సీనియర్ నాయకులు కూడా దాదాపు 99 మంది సిద్ధంగా ఉన్నారు. పొత్తుల అంశంలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని సవాల్ చేసేలా కామెంట్స్ ఉన్నాయని కోమటిరెడ్డిని ఎవరూ సమర్ధించడం లేదు. ఇన్నాళ్ళు అయ్యో సీనియర్ నేత కదా అనుకోని కోమటిరెడ్డిని గుడ్డిగా వెనకేసుకొచ్చిన సీనియర్లు సైతం ఇప్పుడు ఆయనకు రివర్స్ అవుతున్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పలుమార్లు కాంగ్రెస్ పరువు తీస్తూ బిజెపికి మేలు చేస్తూ చాలాసార్లు నోటికొచ్చింది వాగాడు. అయినా అతనిని కాంగ్రెస్ క్షమించింది. నైట్ పార్టీలతో తెగ ఎంజాయ్ చేస్తాడు. పొద్దునే ఏదేదో సొల్లు వాగుతాడు. ఆ మత్తు దిగాకా అందరికి సారి చెప్పుతాడు. ‘నేను అలా అనలేదు. మిరే నా మాటలను వక్రికరించారు’ అని ప్రెస్ మీద నిందలు వేస్తాడు. ఇది చాలాసార్లు జరిగింది. ఓ తాగుబోతు ప్రేలాపన అని జనం కూడా పట్టించుకోలేదు.
ఇప్పుడు కూడా అదే జరిగింది. ‘కాంగ్రెస్ సీనియర్లు అందరు కలిసినా 40 నుంచి 50 సీట్లు కూడా గెలవలేదు అని ప్రెస్ ముందు చెప్పాడు.’ ఇప్పుడు మత్తు దిగాక ‘అది నా మాట కాదు. సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఫలితాలు నేను చెప్పాను. ఆ సర్వేలను మనం నమ్మవద్దు. అన్ని సీట్లు మేమే గెలుస్తాం’ అని ప్లేట్ పిరయించాడు.
‘హంగ్ రాబోతోంది. బిఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు’ అని మైక్ గుద్ది మరి వాదించాడు. మత్తు దిగాకా ఇప్పుడు ‘అది బిఆర్ఎస్ ఆలోచన. మాది కాదు. మేము బిఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవడం ఏమిటి?’ అని ప్రెస్ ని అడ్డంగా నిలదీస్తున్నాడు.
‘రేవంత్ రెడ్డి ఒక్కడే పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ గెలవలేదు. అలా గెలుస్తే నేను ఇంట్లో కుర్చుంటాను’ అని హాంగోవర్ లో అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో చూసి నాలుక కరుచుకుని ‘నా ఉద్దేశం అదికాదు. నేను ఇంట్లో కుర్చున్నా రేవంత్ రెడ్డి పాదయాత్ర వల్ల కాంగెస్ గెలుస్తుంది అని అర్థం’ అని తన తప్పును సరిద్దుకోడానికి చూసాడు. ఈ తాగుబోతు సొల్లు వాగుడు ఎవరు నమ్ముతారో అతనికే తెలియాలి.