మంచు మనోజ్ – భూమా మౌనికల వివాహం జరిగిపోయింది. మంచు లక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. మంచు లక్ష్మి అన్ని తానై ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం.
మంచు మనోజ్ పెళ్లి సందడి మొదలైన నాటి నుంచి అయన తండ్రి మోహన్ బాబు ఎక్కడ కనిపించలేదు. స్పందించలేదు. పెళ్లై ఓ కొడుకు ఉన్న భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడం… మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అయినా మనోజ్ తాను మౌనికను పెళ్లి చేసుకొని తీరుతానని గట్టిగా చెప్పడంతోపాటు ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేశాడు. అందుకే ఈ వివాహ వేడుకకు మంచు లక్ష్మి నివాసం వేదికైందని అంటున్నారు.
మంచు మనోజ్ – మౌనికలను ఆశీర్వదించేందుకు మోహన్ బాబు వస్తారా..? అనే సందేహాలు కొనసాగుతుండగానే కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు వచ్చారు. కాగా, పెళ్లి వేదికపై మోహన్ బాబును చూసి మౌనిక ఎమోషనల్ అయింది. ఆశీర్వాదం తీసుకుంటూ ఆయనను పట్టుకొని ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మౌనిక ఎమోషనల్ కావడానికి కారణం.. అప్పటివరకున్న మానసిక సంఘర్షణ కావొచ్చు. తన వలన ఫ్యామిలీలో విబేధాలు వచ్చాయని.. ఏదీ ఏమైనా పెద్ద మనస్సు చేసుకొని మోహన్ బాబు పెళ్లికి రావడంతో భావోద్వేగానికి లోనై ఆమె కంటతడి పెట్టి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మంచు విష్ణు ఈ వివాహానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.