తనను నమ్మి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చాడు. అందుకు న్యాయం చేయాలనుకుంటారో ఏమో కాని మల్లారెడ్డి మంత్రి అతిగా మాట్లాడుతారు. కాని ఆయన కాన్ఫిడెన్స్ లెవల్ మాత్రం పీక్స్ లో ఉంటాయి. అందుకే మల్లారెడ్డిని పొలిటికల్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటుంటారు. కడుపుబ్బా నవ్వించేలా ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది. ఏపీకెళ్ళి మీడియా ముంగిట ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకే కాదు ఏపీ వాసులకు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం తిరుమల వెళ్లారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో 175 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తనదైన శైలిలో చెప్పడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు నవ్వు ఆపుకోలేకపోయారు.
Also Read : ఆ నలుగురికి కేసీఆర్ బిగ్ షాక్ – మంత్రివర్గం నుంచి ఔట్
బీఆర్ఎస్ లో పార్టీ ఇంకా విస్తరించనేలేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందో క్లారిటీ లేదు. అక్కడ 175 స్థానాలు కాదు. 50స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తే ఎక్కువే. కాని మల్లారెడ్డి మాత్రం 175 స్థానాల్లో పోటీ చేస్తాం. అధికారంలోకి వస్తామని ప్రకటించడం అందరికి నవ్వు తెప్పించింది.
తెలంగాణలో చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్‌ను ఆంధ్రాల్లోనూ అధికారంలోకి తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్లారెడ్డి. అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ సీఎం కంటే ఏపీ సీఎం జనాల ఖాతాలో ఎక్కువ డబ్బులు జమా చేస్తున్నాడు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టకపోయినా ఏపీలో మాత్రం అర్హులైన వారికీ ఇళ్ళ స్థలాలను ఇచ్చాడు జగన్. మరి ఏపీకెళ్ళి తెలంగాణ మంత్రి తెలంగాణ మోడల్ అంటూ మాట్లాడటం అందరికీ నవ్వు తెప్పించింది.