ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అసలు కథకు, సినిమా స్టొరీకి ఏమాత్రం సంబంధం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ గెటప్ కూడా అంతంతమాత్రమే ఉందని పెదవి విరుపులు వచ్చాయి.
ఈ సినిమా వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా కాల్పనిక దృష్టితో తీసినట్లు ఉందని ఆగ్రహావేషాలు వ్యక్తం అవుతున్నాయి. రామాయణాన్ని వ్యాపార ధోరణితో చూస్తారా..? అనే ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత స్పందించింది.
సినిమా అవకాశాలు లేకపోవడంతో మాధవిలత ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. పలు అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. పవన్ పై మాత్రమే స్పందించే మాధవిలత ఈసారి మాత్రం ప్రభాస్ ను టార్గెట్ చేసింది. ఆదిపురుష్ తో జనాలను మెప్పించకపోవడంలో ప్రభాస్ పాత్ర కూడా ఉందని ఆమె అభిప్రాయపడింది.
ఆదిపురుష్ సినిమాపై స్పందిస్తూ అందరూ డైరక్టర్ ను టార్గెట్ చేస్తున్నారని.. ఇందులో ప్రభాస్ ది కూడా తప్పేనని వ్యాఖ్యానించింది. హీరోకు బాధ్యత ఉండదా…? అని నిలదీసింది. ప్రభాస్ కొత్తగా సినిమాలు చేయడం లేదని.. కథ విన్నప్పుడు , డైలాగ్ చెప్పేటప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు. డైరక్టర్ ఏదీ చెబితే అది చేస్తారా..? అని ప్రభాస్ టార్గెట్ గా విమర్శలు చేసింది.
ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తనను ఏమన్నా పరవాలేదు. ప్రభాస్ ది కూడా తప్పు ఉందని మాధవిలత వ్యాఖ్యానించింది. మాధవిలత పోస్ట్ వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాధవిలతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే సహించమని హెచ్చరిస్తున్నారు.
Also Read : ఫోన్ కొట్టు – కాల్ బాయ్ ని పట్టు..!