మదన్ పై ‘కుట్ర‘ మధనం..షబ్బీర్ ఆశలు ఫలించేనా..
* కాంగ్రెస్ ను వీడని వర్గపోరు..
* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు..
* షబ్బీర్ నీచ రాజకీయాలంటూ క్యాఢర్ ఫైర్..
* కాంగ్రెస్ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావును పార్టీ నుంచి ఏడాది బహిష్కరిస్తున్నానంటూ లేఖ విడుదల చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు..
* నిప్పుకు చెదలా అంటూ ఫైర్ అవుతున్న మదన్ మోహన్ రావు అనుచరులు..
* తగ్గేదేలే అంటున్న మదన్ మోహన్ రావు క్యాఢర్..
మదన్ మోహన్ పై కుట్ర
* సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను భూజానికెత్తుకున్న మదన్ మోహన్ రావు..
* కూల్ పాలిటిక్స్ తో ముందుకు సాగుతున్న మదన్ మోహన్ ఫోర్స్ సభ్యులు..
* మదన్ మోహన్ ను సప్పెండ్ చేసే అధికారం డీ.సీ.సీకి లేదంటున్న సీనియర్ నేతలు..
* డీసీసీ అధ్యక్షుడి పదవికే ఎసరు.. గ్రూప్ వార్ కు అజ్యం పోస్తున్న డిసీసీ అధ్యక్షుడిపై పీ.సీ.సీ ఫిర్యాదు చేసిన జిల్లా నేతలు..
కలహాల కాంగ్రెస్ గా ఎవరికి వారుగా ముందుకు సాగుతున్న టీ కాంగ్రెస్ సీనియర్ నేతలను ఒక్క తాటిపై తెచ్చేందుకు ఢిల్లీ హైకమాండ్ పదేపదే వార్నింగులు ఇస్తున్నా.. కొందరు సీనియర్ నేతలు మాత్రం వర్గపోరుతో
పార్టీకి నష్టం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. టీ.పీ.సీ.సీ ఛీఫ్ రేవంత్ తో సీనియర్ నేతలు అమితుమీకి సిద్దమవడంతో పార్టీ అగ్రనేత రాహూల్ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచి మరీ గెలుపే లక్ష్యంగా
ముందుకు సాగాలని పార్టీ పదవులను , భాద్యతలను పంచారు. అయినా కొందరు సీనియర్ నేతల తీరుతో లేని గ్రూప్ వార్ తో పార్టీకి నష్టం వాటిల్లుతూనే ఉందన్నది ఓవర్గం వాదన. నిన్నటి దాకా జగ్గారెడ్డి , విహెచ్ ,
కోమటిరెడ్డి బ్రదర్స్ , ఉత్తమ్ లతో ఉప్పు నిప్పుగా రేవంత్ పోటాపోటీ పాలిటిక్స్ తో కాంగ్రెస్ లో ఎండ్రాకాయల పంచాయితి సద్దుమణినట్లు కన్పించినా.. మదన్ మోహన్ రావు పై కామారెడ్డి డీసీ.సీ.సీ అధ్యక్షుడు కైలాస్
శ్రీనివాసరావు ఏడాది సస్పెండ్ విధిస్తున్నట్లుగా లేఖ విడుదల చేయడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది… కష్టాల్లో ఉన్న వారికి సేవ చేయడమేనా మదన్ మోహన్ చేసిన తప్పు..కాంగ్రెస్ క్యాఢర్ ను
కంటికి రెప్పలా కాఫాడుకోవడమేనా మదన్ మోహన్ చేసిన తప్పు ..అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే కాక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు , కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం ప్రశ్నిస్తుంది.
తాడో పేడో తేల్చుకుంటాం అంటూ గాంధీ భవన్ లో టీ.పీ.సీ.సీ పెద్దల వద్దే గ్రూప్ వార్ ముగిస్తామంటున్నారు. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ పెద్దలు సైతం మదన్ మోహన్ రావు పై సస్పెండ్ ఏంటని ఆరా తీస్తున్నారని
సమాచారం.
రేవంత్ రెడ్డి టీ.పీ.సీ.సీ అధ్యక్షుడయ్యాక రేవంత్ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మదన్ మోహన్ రావు పాల్గొంటున్నారు. కరోనా సమయంలోనూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ తో పాటు ఉచిత అంబులెన్స్ సదుఫాయాలు చేసి
తక్కువ సమయంలోనే ఎల్లారెడ్డి , కామారెడ్డి నియోజకవర్గాల్లో తన సత్తా చాటుతున్నారు. వేలాది మందికి ఉఫాది లభించేలా జాబ్ మేళా నిర్వహించారు. యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ టి.ఆర్.ఎస్ అవినీతిపై నిత్యం
పోరాటాలు సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలోనే మదన్ మోహన్ రావు రానున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. క్యాఢర్ లోనూ పూర్తి మద్దతు
లభించడంతో మదన్ మోహన్ రావు పోటీకి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. సీనియర్ నాయకుడైన షబ్బీర్ అలీ మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతుండడంతో తన ప్రాభవం తగ్గుతుందన్న
భయంతోనే మదన్ మోహన్ రావుకు అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించే పనిలో ఉన్నారన్న ప్రచారం లేకపోలేదు. మన ఊరు..మన పోరు కార్యక్రమాన్ని మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు
చేయించి లక్షలాది మందితో సభ గ్రాండ్ సక్సెస్ చేయడంతోనే షబ్బీర్ వర్గీయులు మదన్ మోహన్ రావు పై కుట్రకు తెరతీశారని ఆరోపిస్తున్నారు మదన్ మోహన్ రావు అభిమానులు.
సీనియర్ నేత షబ్బీర్ అలీ తీరుతో సీనియర్ నేతలు మొదలు యువజన కాంగ్రెస్ , కాంగ్రెస్ అనుభంధ విభాగాల నేతలంతా మదన్ మోహన్ రావు కు దగ్గరవడంతో షబ్బీర్ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర
స్దాయి హోదాలో ఐటీ సెల్ కమిటీ చైర్మన్ గా ఉన్న మదన్ మోహన్ రావును కామారెడ్డి డి.సీ.సీ అధ్యక్షుడేలా ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్లుగా లేఖ విడుదల చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే వెలమ సామాజిక వర్గం కాంగ్రెస్ దూరమయిన తరుణంలో కరుడు గట్టిన కాంగ్రెస్ వాది అయిన మదన్ మోహన్ రావు ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ బెడుతున్నారన్న ప్రచారం లేకపోలేదు.
కాంగ్రెస్ పార్టీలో కలహాలు సద్దుమణుగుతున్నాఅనుకుంటున్న తరుణంలో ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు సస్పెన్షన్ వివాదం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పార్టీకి విధేయులపై కుట్రలేంటని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ పెద్దలు ఈ వివాదంలో రాష్ట్ర నాయకత్వలోపం..నేతల తీరుపై చర్యలు తీసుకోకుంటే ఉమ్మడి నిజామాబాద్ లో కాంగ్రెస్ కు కష్టకాలమేనంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.