ఇటీవల కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే తమకు నచ్చిన వారితోనే జీవితం పంచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపిస్తోంది. లింగబేధం చూపకుండా ఒక్కటైపోతున్నారు. ఇద్దరు స్నేహితులు ( ఆడవారు) లేదా, మగవారు పెళ్లి చేసుకుంటున్న వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. అయితే..వీరిద్దరి ఒప్పందంలో భాగంగా ఓ యువతి లింగమార్పిడి చేసుకుని మగవారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆ యువతి ఇచ్చిన షాక్ కు లింగమార్పిడి చేసుకున్న యువతి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమకథలో అసలేం జరిగిందో చూద్దాం.
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీజిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. దీంతో వీరు నిర్ణయానికి వచ్చేశారు. జీవితాంతం కలిసి ఉండాలంటే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. ముందుగా నిర్ణయించుకున్నట్లు ఒప్పందం ప్రకారం ఇద్దరిలో ఒకరు మగవారిగా మారాలనుకున్నారు.
ఇందులో భాగంగా సనాఖాన్ ఢిల్లీలో లింగమార్పిడి చికిత్స చేసుకొని పురుషుడిగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనాల్ కు ఓ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. సోనాల్ పనిచేసే ఆసుపత్రిలోనే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారింది. సోనాల్ ఆ యువకుడితో ప్రేమలో పడటంతో సనాఖాన్ ను దూరం పెట్టె ప్రయత్నం చేసింది.
విషయం తెలిసిన సనాఖాన్ సోనాల్ ను నిలదీసింది. దీంతో ఆగ్రహానికి లోనైనా సోనాల్.. తాను నీతో కలిసి ఉండటం సాధ్యం కాదని.. నువ్వు మళ్ళీ అమ్మాయిగా మారిపోయి…అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసరికి సనాఖాన్ ను ఫ్యూజుల్ ఎగిరిపోయినంత పనైంది. నిన్ను అమితంగా ప్రేమించి.. మన ప్రేమ కోసం పురుషుడిగా మారితే నీసౌఖ్యం కోసం నన్ను మళ్ళీ అమ్మాయిగా మారమంటావా అంటూ ప్రశ్నించింది.
సోనాల్ మాటలు సనా ఖాన్ మనస్సును తీవ్రంగా కలచివేశాయి. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో సనా ఖాన్ తట్టుకోలేకపోయింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక సనా ఖాన్ నాకు న్యాయం చేయాలంటూ మే 30, 2022న కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన న్యాయస్థానం సోనాల్ కు నోటీసులు జారీ చేసింది.
న్యాయస్థానం నోటీసులను సోనాల్ ఖాతరు చేయకపోవడంతో పోలీసుల సాయంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం ఆమెకు బెయిల్ రాగా, తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ ఘటనలో సనా ఖాన్ కు న్యాయం జరుగుతుందా? అసలేం జరగనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.