వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదా..? నాలుగు జిల్లాలో ఆ పార్టీ ఖాతా కూడా తెరవదా..? 11మంది మంత్రులకు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదా..? ఓటమి భయంతోనే కమ్యూనిస్ట్ పార్టీల పొత్తుకు బీఆర్ఎస్ ఆరాటపడుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోన్న కేసీఆర్ కు తాజాగా అందిన ఓ సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. డిసెంబర్ నుంచి వరుసగా సర్వేలు చేయిస్తోన్న కేసీఆర్ ఇటీవల మరో సర్వే చేయించారు. డిసెంబర్ నాటి సర్వేతో పోలిస్తే తాజాగా అందిన నివేదిక ప్రకారం 6శాతం పార్టీ గ్రాఫ్ పడిపోయిందని తేలింది. ఇటీవలి టీఎస్ పీస్సీ పేపర్ లీక్ , టెన్త్ పేపర్ లీక్ లో సర్కార్ వైఫల్యంతోపాటు రైతు బంధు నిధులు , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , సొంత జాగ ఉన్నవాళ్ళకు మూడు లక్షల ఆర్ధిక సాయం, ఉద్యోగ నియామకాల్లో సర్కార్ నాన్చివేత ధోరణి అవలంభిస్తుండటం బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు ప్రధాన కారణాలని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి, లైంగిక ఆరోపణలు కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయని కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ అందించిన సర్వే నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నాటికీ ఎమ్మెల్యేల పనితీరుతోపాటు వైఖరి మార్చుకోకపోతే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సున్నా డిజిట్ కే పరిమితం అవుతుందనే హెచ్చరించినట్లు బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ నాలుగు జిల్లాలో బీజేపీ – కాంగ్రెస్ లు బలంగా పుంజుకున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 65స్థానాల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగుతుందని బీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో 11మంది ప్రస్తుత మంత్రులు ఘోర పరాజయం పాలు కానున్నారని సర్వేలో ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై చాలావరకు వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చితే కొంతవరకు మెరుగైన ఫలితం రాబట్టే అవకాశం ఉందని సూచించారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు పొత్తులతో వెళ్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. అందుకే ఖమ్మం, నల్గొండ జిల్లాలో కొంతమేరకు ప్రభావం చూపే లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ కు సూచించినట్లు తెలుస్తోంది.
Also Read : కేటీఆర్ తో సెల్ఫీకి రూ. 500 – మరీ ఇంత తక్కువేంటి గురూ..!!