ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న తెలంగాణ సర్కార్ పెండింగ్ హామీల అమలుకు నిధుల సమస్య రాకుండా చూసుకుంటుంది. ఇందుకోసం హైదారాబాద్ లోని విలువైన భూములను వేలం పాట ద్వారా అమ్ముతున్నది. దాంతో సర్కార్ ఖాజనాకు భారీగా నిధులు సమకూరుతున్నాయి.
ఇదంతా బాగానే ఉన్నా భూములను అమ్మోద్దంటూ ప్లకార్డుతో కేటీఆర్ నిరసన తెలిపిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫ్లకార్డుల్లో.. “ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి – టీఆర్ఎస్” అని రాసి ఉంది. ఆ ఫ్లకార్డును రెండు చేతులతో పైకి ఎత్తిపట్టుకుని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు. ఈ ఫొటోనే సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నాడు సమైక్య పాలకులు భూములను అమ్మితే రియల్ ఎస్టేట్ వ్యాపారమని వ్యాఖ్యానించిన కేటీఆర్..ఇప్పుడు అదే చేస్తోన్న తన తండ్రిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావా అని కేసీఆర్ ను నిలదీయగలడా..? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా…అధికారంలో లేకపోతే ఒకలా మాట్లాడటం సరైంది కాదు. మిగులు బడ్జెట్ గానున్న తెలంగాణకు సంక్షేమ పథకాల అమలు కోసం భూములను అమ్ముకోవాల్సిన దుస్థితా అంటూ ఆశ్చర్యపోతున్నారు. డ్రామారావు డబుల్ యాక్షన్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ గాలం – గ్రేటర్ లోని ఆ సీట్ ఆఫర్..?