కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ కాబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్.. అమిత్ షాతో సమావేశం కానుండటం ఆసక్తి రేపుతోంది. భేటీ ప్రాధాన్యత అంశాలు ఏంటో బయటకు రాలేదు కాని బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం జరుగుతోన్న సమయనా ఈ భేటీ జరుగుతుండటం బిగ్ డిబేట్ గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిచిన నాటి నుంచి బీజేపీపై కేసీఆర్ , కేటీఆర్ లు మునుపటి స్థాయిలో విమర్శలు చేయడం లేదు. కాంగ్రెస్ ను మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ లో విచారణ మందగించడంతో బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానాలు ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా ప్రజల్లో ఈ అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
అప్పటి నుంచి బీజేపీ క్రమంగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది. వలస నేతలు కొంతమంది పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను చూసి, అంచనా వేసి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతు వస్తోంది. ఓ వైపు బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ నేతలు కౌంటర్ గా ప్రకటనలు చేస్తున్నారు.
ఈ సమయంలో షా తో కేటీఆర్ పర్యటన తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళడంతోపాటు. అది కాంగ్రెస్ కు అస్త్రంగా మారుతుంది.
Also Read : కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా – బీఆర్ఎస్ లో చేరిక ఎప్పుడంటే..?