టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో 30మంది గ్రూప్ -1ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయితే అందులో…జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కడు మాత్రమే వందకు పైగా మార్కులు సాధించాడని కేటీఆర్ చెప్పినదంతా అబద్దమేనని తేలింది. పైగా అబద్దాలను నమ్మించేందుకు తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని కేటీఆర్ చెప్పడం గమనార్హం.
మాల్యాల మండలానికి చెందిన కేటీఆర్ పీఏ తిరుపతి ఈ లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని రేవంత్ రెడ్డి , బండి సంజయ్ ఆరోపించారు. తిరుపతి సొంత మండలం మాల్యాల మండలంలో వంద మందికి గ్రూప్ -1 ఎగ్జామ్ లో 100కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. తిరుపతికి కేటీఆర్ అండదండలు ఉన్నాయని.. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ పై విచారణ జరుపుతోన్న సిట్ కేటీఆర్ ను విచారిస్తే అసలు విషయం బయటకొస్తుందని విపక్ష నేతలు వ్యాఖ్యానించారు. కానీ, ఈ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు నోటిసులు ఇచ్చిన సిట్ కేటీఆర్ ను మాత్రం విచారణకు పిలవకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే, ప్రశ్నా పత్రాల లీక్ పై దూకుడుగా విచారణ జరుపుతోన్న సిట్ విచారణలో కీలక సమాచారాన్ని గుర్తించింది. కేటీఆర్ పీఏ మండలం మాల్యాల మండలంలోనే 40 మందికి వందకు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది.
ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ..తన పీఏ తిరుపతి చాలా మంచోడు. ఎనిమిదేళ్ళుగా తన దగ్గర పని చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను వదిలేసి అతనిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి సొంత మండలమైన మాల్యాల మండలంలో వంద మందికి వంద మార్కులకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ , బండి సంజయ్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మాల్యాల మండలంలో కేవలం 30మంది మాత్రమే గ్రూప్-1 ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయ్యారని… అందులో జగిత్యాల జిల్లా మొత్తం వెతికితే ఒకే ఒక్కడు మాత్రమే వందకు పైగా మార్కులు తెచ్చుకున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను చెప్తున్నది గాలి మాటలు కావని… పక్కా ఆధారాలతోనే చెప్తున్నానని ప్రజలందరి సమక్షంలోనే చెప్పారు. తాజాగా కేటీఆర్ చెప్పిన ఆ సమాచారం తప్పని సిట్ నిర్ధారించింది. మల్యాల మండలంలోనే 40 మందికి వంద మార్కులకుపైగా వచ్చినట్లు గుర్తించింది.
ప్రతిసారి తాను మాట్లాడితే ఆధారాలతో మాట్లాడుతా…ఉరికే నోటికి ఎదోస్తే అది మాట్లాడనని చెప్పే కేటీఆర్ జగిత్యాల జిల్లాలో ఒకే ఒక్కడు 100 మార్కులకుపైగా సాధించాడని చెప్పింది అబద్దం కాదా..? ప్రజలందరి సమక్షంలో నిజాలకు ముసుగేసి అబద్దాలను ప్రచారం చేయడానికి కేటీఆర్ కు ఏమైనా బాధ్యత ఉన్నదా..? రాష్ట్ర మంత్రి హోదాలో ఆధారాలతో మాట్లాడుతున్నా అంటూ కాగితాలను ప్రదర్శిస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలను కేటీఆర్ ఎంత అజ్ఞానులు, అమాయకులు అనుకుంటున్నారో ఈ ఒక్క సంఘటన తెలియజేయదూ..!
తాజాగా మల్యాల మండలంలోనే 40 మందికి 100 మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో కేటీఆర్‌ను విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లీకేజీలో కీలక పాత్ర కేటీఆర్, ఆయన కుటుంబానిదే అని పునరుద్ఘాటిస్తున్నారు.మరి సిట్ అధికారులు కేటీఆర్‌కుగానీ, ఆయన పీఏ, మల్యాల మండలానికి చెందిన తిరుపతికిగానీ కనీసం నోటీసులు ఇచ్చే సాహసం చేస్తారో లేదో చూడాలి.
Also Read : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ – కేటీఆర్ కుట్ర కోణం..?