డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీని కంప్లీట్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై విపక్షాల నుంచి మాటల దాడి కొనసాగుతుండటంతో తొందరగా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చేసి విపక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ బుధవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు.
వారం రోజుల్లో తొలి విడత ఇళ్ళ పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరీ వెరిఫికేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని తొందరలోనే ఇళ్ళ పంపిణీ చేపడుతామని స్పష్టం చేశారు.
70వేల ఇల్లు పంపిణీకి రెడీగా ఉన్నట్లు అధికారులు చెప్పారన్న కేటీఆర్…ఈ ఇళ్ళను దశల వారీగా అర్హులైన వారికి అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే వారంలో మొదటి విడత ఇళ్ళ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.
కేటీఆర్ అద్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రా రెడ్డి , మహమూద్ అలీ , మల్లారెడ్డి , పద్మారావు మరియు అధికారులు హాజరయ్యారు.
Also Read : ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ కు ఏం ఫాయిదా..?