బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఢిల్లీలో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కీలక నేతలంతా హాజరు కావాలంటూ గులాబీ బాస్ ఆదేశించారు. మంత్రులంతా హస్తిన వెళ్ళిపోయారు. కాని కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ ప్రారంభోత్సవ వేడుకకు దూరంగా ఉంటున్నారు.
హైదరాబాద్ లో ముఖ్యమైన సమావేశాలలో కేటీఆర్ పాల్గొనాల్సి ఉందని అందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని అంటున్నారు కాని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుక కన్న ఆయనకు ముఖ్యమైన మీటింగ్ ఏముంటుందన్నది సహజంగా అందరిలో కలిగే ప్రశ్న. కవిత మాత్రం రెండు రోజుల ముందే ఢిల్లీలో వాలిపోయింది. బీఆర్ఎస్ పై ఆమె మాత్రమే తరుచుగా, ఎక్కువగా మాట్లాడుతున్నారు. బీఆరెస్ పై కేటీఆర్ పెద్దగా మాట్లాడటంలేదు. దాంతో జాతీయ రాజకీయాలపై కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏదో జరుగుతుందన్న చర్చ తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ అసలు లక్ష్యమే రాష్ట్ర పాలన పగ్గాలు కొడుకు కి ఇచ్చి, జాతీయ స్థాయిలో కవితని యాక్టిివ్ చేయడమనీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.
కేటీఆర్, కవిత ల మధ్య పదవులు, పార్టీ విషయంలో విబేధాలు వచ్చాయని ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది. అదే సమయంలో కొంతకాలం ఆమె రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది. టీఆర్ఎస్ అనుకూల పత్రికలో కవిత పేరు కూడా రాలేదు.దాంతో అన్న, చెల్లిల మధ్య విబేధాలు తొలగిపోయేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ను తీసుకొచ్చారని…ప్రస్తుతం వారి మధ్య ప్రాబ్లం ను కేసీఆర్ సాల్వ్ చేసినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాలను కవితకు, రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్ అప్పగించనున్నారని అంటున్నారు.