అమ్మ పాలు తాగి, ఆ రొమ్మునే గుద్దే వాళ్లు జనంలో అక్కడక్కడ ఉంటారు. కానీ రాజకీయలల్లో అడుగడునా ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఎంపి వెంకట్ రెడ్డి ముందు అడుగులో ఉన్నారు. ఎందుకంటే అతను కాంగ్రెస్ బ్రాండ్ లేబుల్ వాడుకుని తన రాజకీయ లబ్ది పొందుతున్నారు. ఈ జబ్బు ఇతనికే కాదు, ఇతని రక్తం పంచుకుని పుట్టిన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా ఉంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధినీత్రి సోనియా గాంధీని బిజెపి ముపతిప్పలు పెడుతూ ఈడి అధికార్లులు గంటల తరబడి ఆమెను కార్యాలయంలో వెయిట్ చేయించారు. ఆమె ఆరోగ్దేయం కూడా బాగోలేదు. దేశం మొత్తం అట్టుడికింది. ఆ క్లిష్ట సమయంలో కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన వ్యాపార లబ్ది కోసం కాంగ్రెస్ కీ రాజీనామా చేసి బిజెపిలో తీర్థం పుచ్చుకున్నారు. ఆపదలో ఆదుకోవలసిన వాడే అనర్ధాలు సృష్టించాడు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడం కాదు, వెన్ను విరిచారు. అప్పటికే కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించి, కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్ తో తన వ్యాపారం విస్తరించుకున్నారు.
అప్పుడు తమ్ముడిని మందలించ వలసిన ఈ కాంగ్రెస్ పెద్ద మననిషి వెంకట్ రెడ్డి దానిని సమర్దించాడు. పైగా బిజెపి తీర్థం పుచ్చుకోవాలని చూశారు. కానీ ‘తల్లి రొమ్ములు గుడ్డివాడు మాకు వద్దు’ అన్నట్లు వెంకట్ రెడ్డి ని దూరం పెట్టింది బిజెపి. లేకపోతే తమ్ముడితో పాటు ఇతను కూడా ఈపాటికి జెండా ఎత్తేసేవారు.
ఆ తర్వాత మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి పాల్గొలేదు. వేదేశాలకు చేక్కేసారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దత్తు ఇవ్వకుండా తిన్నఇంటి వాసాలు లెక్కపెడుతూ బిజెపిలో చేరిన తన తమ్ముడికి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. దీనిని మించిన పార్టీ ద్రోహం మరొకటి ఉన్నదా? మొగుడి సొమ్ము తింటూ పక్కింటి మొగుడితో సరసం ఆడే భార్యలా లేదా?
కాంగ్రెస్ కి ఏ ఆపద వచ్చినా వెంకట్ రెడ్డి నోరు తెరువరు. నోట్లో పాన్ పెట్టుకుని నములుతూ కూర్చుంటారు. అదే బిజెపికి ఏ చిన్న అపద వచ్చినా నోట్లోంచి పాన్ ఉమ్మేసి, మీడియా ముందుకు వచ్చి దానిని పరోక్షంగా సమర్థిస్తారు. దీనితో ‘మేము చేసిన చర్యను కాంగేస్ కూడా మెచ్చుకుంటోంది’ అని బిజెపి తప్పుడు సంకేతాలను జనంలోకి తిసుకేలుతోంది. ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి ఇలాంటి పనులే చేస్తారు.
దీనికి తోడూ ఇతనికి పుబ్లిసిటీ పిచ్చి ఎక్కువా. ముందుగా వివాదాస్పద వాక్యలు మీడియాకు విదుల చేస్తారు. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు ప్రజల నుంచి మొట్టికాయలు పడగానే ఒక్క సారిగా ‘యూ ‘ టర్న్ తీసుకుంటారు. నేను అలా అనలేదు, మీడియా నా మీద వదంతులు పుట్టించింది అని పచ్చి అబద్దాలు చెపుతారు. వచ్చే ఎన్నికలల్లో కాంగ్రెస్ కి 40 నుంచి 50 మధ్య అసంబ్లీ సీట్లు కుడా గెలవలేదు అని కాంగ్రెస్ మీద బురద చల్లారు. అందరు మొట్టికాయలు వేసేసరికి ‘నేను అలా అనలేదు. మీడియా అబద్దాలు ప్రచరం చేస్తోంది’ అని పచ్చి అబద్దాలు చెప్పారు. కానీ మీడియా అతను వాగిన రెండు వెర్షన్ లను ప్రచారం చేసి పరువు తీసినా మారలేదు. అతని పద్దతి మార్చుకోలేదు.
ఇప్పుడు పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ లో బండి ఇరుక్కోవడం తో బీజేపీ పరువు పోకుండా, జనం మైండ్ డైవర్ట్ చేయడానికి మరోసారి వెంకట్ రెడ్డి మీడియా ముందకు వచ్చారు. తాను బిజిపి లో చేరుతున్నట్లు అతనే మీడియాకు లీక్ చేశారు. అది వైరల్ గా మారగానే అతని కార్యకర్తల నుంచి, ప్రజలనుంచి మొట్టికాయలు పడ్డాయి. దానితో మీడియా ముందుకు వచ్చి ఎప్పటిలా ఆ వార్తను ఖండిస్తూ ‘నేను బిజెపిలో చేరడం లేదు’ అని చిలక పలుకులు పలికారు. ఇది కేవలం బిజెపి మీద ప్రజలు ద్యాస పెట్టకుండా, మైండ్ డైవర్ట్ చేయడానికే. ఇది ఓ ఎంపి స్టాయి వాడికి భావ్యం కాదని, ఓ కార్పొరేటర్ లా మాట్లాడకూడదు అని జనం ఎద్దేవ చేసున్నారు.