ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలనేది విపక్షాల ఆలోచన. కేసీఆర్ ను ఓడిస్తే బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీసినట్లు అవుతుందని అనుకుంటున్నారు. అందుకే కేసీఆర్ పై విపక్షాల తరుఫున ఒకే అభ్యర్థిని బరిలో దించాలని చర్చలు సాగుతున్నాయి.
ఏదో ఓ పార్టీకి చెందిన నేతను కేసీఆర్ పై పోటీకి దింపితే ఒక్కొక్క పార్టీ ఒక్కో వాదనను వినిపిస్తాయి. అందుకే న్యూట్రల్ గా ఉండే నేతను కేసీఆర్ పై పోటీకి నిలపాలని అనుకుంటున్నారు. అందుకు కోదండరాం సరిగ్గా సెట్ అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ సాధనలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా కొనసాగిన కోదండరాం రాష్ట్రం ఏర్పాటయ్యాక పార్టీ పెట్టారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు.
కోదండరాంకు కేసీఆర్ పదవుల ఆశ చూపినా బీఆర్ఎస్ లో చేరలేదని ఆయనపై మంచి ఒపినియన్ ఉంది. ప్రజల్లో ఓ రకమైన సానుభూతి కూడా ఉంది . దాంతో కేసీఆర్ కు సరైన ప్రత్యర్ధి కోదండరామేనని అంచనాలు కూడా ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ , కాంగ్రెస్ ఒకే అభ్యర్థికి మద్దతు ఇవ్వవు. ఇప్పుడు మద్దతు ఇచ్చినా దానిని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ కు బాగా తెలుసు.
దాంతో కోదండరాంను కేసీఆర్ పై పోటీకి నిలపాలని ప్లాన్ చేస్తున్నా… అది అంతిమంగా బీఆర్ఎస్ కు లాభం చేకూర్చుతుందా..? అనే చర్చలు నడుస్తున్నాయి. కోదండరాంను టీజెఎస్ అభ్యర్థిగా ఎవరూ చూడరు. ఉద్యమ సారధిగానే గుర్తిస్తారు. కాబట్టి కాంగ్రెస్ , బీజేపీలు బీఆర్ఎస్ ను వాదనను ఎదుర్కొంటూ ముందుకు సాగితే కేసీఆర్ ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు.
Also Read : బిగ్ న్యూస్ – తన వర్గం నేతలతో కాంగ్రెస్ లోకి హరీష్ రావు..?