ఈ నెల 23న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ , బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. కాకపోతే వివాహ ముహూర్తం కొద్దిగా లేట్ అయింది.
భారత జట్టు తరుఫున నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ పెళ్లి పీటలు ఎక్కనుండటంతో మరికొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరంగా వుండబోతున్నాడు. వీరి వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. కేఏల్ రాహుల్ ,అతియా శెట్టి విహహ వేడుకలు ముంబైలో అతియా శెట్టి నివాసంలో జరుగనున్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం.
వీరిద్దరి విహహ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ నుంచి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. చాలా కాలంగా ప్రేమ లో ఉన్న ఈ జంట
ఈ నెల 23 న ఒక్కటవుతున్నారు.