రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజామున జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆదిభట్ల పొలిసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన ఈ కిడ్నాప్ పెళ్లితో సుఖాంతం అయింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తాజాగా యువతి ఓ సెల్ఫి వీడియో విడుదల చేయడంతో ఆమె కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు.
తాను, జాని అనే యువకుడిని ప్రేమించానని, తన ఇష్టపూర్వకంగానే జానీ తనను తీసుకెళ్లాడని యువతి తెలిపింది. తన సమ్మతితోనే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. తన పేరెంట్స్ పెళ్లిచూపులు చూస్తున్నారని, జానీకి ఫోన్ చేసి చెప్పడంతో తనను తీసుకెళ్లాడని తెలిపింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని తనే కోరినట్లు వివరించింది. తనను కారులో తీసుకెళ్ళే సమయంలో జానీ మాస్క్ ధరించి ఉండటంతో , అతను ఎవరో గుర్తించలేదని చెప్పింది. ఆ తరువాత కారులో కూర్చుకున్నాక జానీ అని తెలిసి రిలాక్స్ అయినట్లు తెలిపింది. అయితే, తమకు తన కుటుంబం నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకుంది.
మరో ట్విస్ట్ ఏంటంటే… షాలిని, జానీలు ఏడాది కిందటే వివాహం చేసుకున్నారు. అప్పుడు షాలిని మైనర్ కావడంతో పోలీసులకు ఆమె పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి వేర్వేరుగానే ఉంటున్నారు. తాజాగా ఆమె మైనార్టీ తీరిపోవడంతో షాలినికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె జానికి చెప్పింది. తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో తెల్లవారుజామున ముగ్గురితో కారులో వచ్చిన జానీ శాలిని అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. ఇద్దరు మేజర్లు కావడంతో ఈరోజు పెళ్లి చేసుకున్నారు.