టీ. టీడీపీలో ఫుల్ జోష్ వచ్చిందా..? ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తుందా..?ఘర్ వాపసీకి చంద్రబాబు తెరతీయడంతో కొంతమంది కీలక నేతలు తిరిగి టీడీపీలో చేరబోతున్నారా..? టీడీపీకి టచ్ లోకొచ్చిన పాత నేతలు ఎవరు..?
Also Read : టీఆర్ఎస్ కు బిగ్ షాక్ – నలుగురు ఎమ్మెల్యేలు జంప్..?
ఒకే సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత టీడీపీ ఒంటరిగా ఏర్పాటు చేసిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ సభ విజయవంతం కావడంతో తెలుగు తమ్ముల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు మరెంతో కాలం సమయం లేదు. దీంతో టీడీపీ తన రాజకీయ వ్యూహ,ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఉనికి కోల్పోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక టీడీపీపైనున్న ఆంధ్రపార్టీ అనే ముద్ర లేకుండా పోయింది. దీంతో తెలంగాణలో పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి.
Also Read : ఆ సీనియర్లు గంపగుత్తగా బీజేపీలోకి వెళ్లనున్నారా..?
టీ. టీడీపీ అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖమ్మం సభను ప్లాన్ చేశారు. ఈ సభ ఊహించని విధంగా విజయవంతమైంది. చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఖమ్మం ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సభకు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళు తరలివచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఇంకా బలీయంగానే ఉందని పార్టీ అధినేతకు అర్థమైంది. ఈ క్రమంలోనే ఆయన సభ వేదిక నుంచి పాత నేతలను తిరిగి రావాలంటూ పిలుపునిచ్చారు. వాస్తవానికి , బీఆర్ఎస్ కొనసాగుతోన్న కీలక నేతలంతా టీడీపీకి చెందినవారే. అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి కేసీఆర్ వారిని సంతృప్తి పరిచారు కాని, మిగతా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Also Read : సేవ్ కాంగ్రెస్ సీనియర్ల నినాదమట – ముంచేయడం ఖాయమే..!
ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ , గ్రేటర్ హైదరాబాద్ , నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. ఈ జిల్లాకు చెందిన పాత టీడీపీ నేతలు, ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కరుణ లేక పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభ హైలెట్ కావడంతో వారిలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఖమ్మం సభ ద్వారా పాత నేతలకు చంద్రబాబు ఆహ్వానం పలకడంతో.. వారు కూడా టీడీపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదు. సిట్టింగ్ లకే టికెట్ అంటూ కేసీఆర్ ప్రకటనతో పాత నేతలు ఆలోచనలో పడ్డారు. బీజేపీలోకి వెళ్తే నిలదోక్కుకోలేమని భావనతో సొంత గూటికి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలనుంది. త్వరలోనే టీడీపీలోకి చేరికలు ఊపందుకుంటాయని తెలుస్తోంది.
Also Read : అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వెనకడుగు – కవిత వల్లేనా..?