వాలంటైన్స్ డే రోజున కండోమ్ లు పంపిణీ – ప్రభుత్వం కీలక నిర్ణయంవాలంటైన్స్ డే సమీపిస్తోంది. ఫిబ్రవరి 14ను ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోజు నుంచి కొంతమంది ప్రేమికులు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారు. మరికొంతమందేమో ఫిజికల్ అటాచ్ మెంట్ పెట్టుకుంటారు. దీని వలన అవాంచిత గర్భం వచ్చే అవకాశం ఉందని వీటిని నియత్రించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
థాయ్ లాండ్ గురించి చెప్పేదేముంది.? అక్కడ విచ్చలవిడి శృంగార స్వేఛ్చ ఉంటుంది. ఫలితంగా టీనేజ్ లో అమ్మాయిలు గర్భం దాలుస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వాలెంటైన్ డే సందర్భంగా ప్రేమికులు శారీరకంగా కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ప్రేమికుల రోజున ఒక్కొక్కరికి పది కండోం లు అందించాలని నిర్ణయించింది.
స్మార్ట్ ఫోన్ ద్వారా పేరు నమోదు చేసుకొని కండోమ్ లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లు వాడని వారు ఆ దేశపు ఐడీ కార్డు చూపిస్తే ఉచితంగా కండోంలను పొందవచ్చు. టీనేజ్ వయస్సు పిల్లలు గర్భం డాల్చవద్దని థాయ్ లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రేమికుల రోజు జాగ్రత్తలు తీసుకోవాలనే హెచ్ ఐవీ వంటి రోగాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించింది థాయ్ లాండ్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే టీనేజ్ లో ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని భావిస్తోంది. వీటి బారి నుంచి రక్షించుకోవాలని యువతకు కండోమ్ లు అందజేస్తోంది.
Also Read : నా భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయి – హీరోయిన్ సంచలన ఆరోపణలు