కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం ఏఐసీసీ ఓబీసీ కో ఆర్డినేటర్ , తమిళనాడు ఇంచార్జ్ డా. కేతూరి వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సెంటిమెంట్ దృష్ట్యా తన కూతురితో కలిసి గాంధీ భవన్ కు వచ్చిన కేతూరి వెంకటేష్ కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి తన దరఖాస్తును సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈసారి టికెట్ తనకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొల్లాపూర్ లో పెరిగిన బహుజనవాదం తన గెలుపుకు దోహదం చేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొల్లాపూర్ టికెట్ కోసం జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్ రావులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒక్క కేతూరి వెంకటేష్ మాత్రమే బీసీ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ కోటాలో తనకు టికెట్ వస్తుందని నమ్మకంతోఉన్నారు. 1962తరువాత కొల్లాపూర్ నుంచి ఇప్పటివరకు బీసీ అభ్యర్థికి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓటు బ్యాంక్ 93శాతంపైగానే ఉంది. ఇది కేతూరి వెంకటేష్ కు కలిసొచ్చే పరిణామంగా చెప్పొచ్చు.
కేతూరి వెంకటేష్ నేపథ్యం :
కేతూరి వెంకటేష్ ఓయూ విద్యార్ధి నేతగా తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత కనబరుస్తూనే పార్టీ లైన్ లోనే ఉద్యమం చేపట్టారు. ఆయనపై పదుల సంఖ్యలో కేసులు కూడా ఉన్నాయి. ఎన్ఎస్ యూఐ ఓయూ అద్యక్షుడిగా, కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడిగా, రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ కో ఆర్డినేటర్ గా , పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా కేతూరి పార్టీ కోసం పని చేశారు. ఆయా విభాగాల్లో పని చేసిన కేతూరికి కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి సముచిత స్థానం కల్పిస్తుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన నేతలకే టికెట్లు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి…రెండు దశాబ్దాలుగా పార్టీకోసం జీవితాన్ని వెచ్చించిన కేతూరి అభ్యర్తిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
జోడో యాత్రలో మెరిసిన కేతూరి :
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ వెంట కేతూరి పాదయాత్ర చేశారు. అదివరకే రాహుల్ దృష్టిలో పడిన కేతూరి జోడో యాత్ర ద్వారా రాహుల్ కు సన్నిహితుడిగా మారారు. ఓయూ విద్యార్ధి నేతలను కాంగ్రెస్ వాడుకొని వదిలేసిందనే అప్రతిష్టను తుడిచేసేందుకు ఓయూ ఉద్యమకారులకు 3నుంచి 5సీట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. ఈ కోణంలోనూ కేతూరికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఈ లెక్కన టికెట్ రావడం ఖాయమే :
మరోవైపు ఉదయ్ పూర్ – రాయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం చూస్తే ఓ పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండు స్థానాలను బీసీలకు ఇవ్వాలి. ఈ లెక్కన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట్ , ఆలంపూర్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. మిగిలిన ఐదు నియోజకవర్గాలు ( గద్వాల , కొల్లాపూర్ , వనపర్తి, నాగర్ కర్నూల్ , కల్వకుర్తి) ఇందులో ఓ రెండు స్థానాలను బీసీలకు ఇవ్వాల్సి ఉంది. వనపర్తి , నాగర్ కర్నూల్ , కల్వకుర్తి.. ఈ మూడు స్థానాలు ఎలాగు రెడ్లు పోటీ చేయడం ఖాయం. కాబట్టి కొల్లాపూర్, గద్వాల.. ఈ రెండు జనరల్ స్థానాలను బీసీలకు టికెట్ కేటాయించాల్సి ఉంటుంది. అనుభవం, పార్టీకి నిజాయితీగా పని చేసిన వారి జాబితా చూస్తే కొల్లాపూర్ నుంచి కేతూరి వెంకటేష్ కు టికెట్ దక్కే అవకాశాలు వందశాతం ఉన్నాయి.
బీఆర్ఎస్ పై విమర్శలు – కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుంటుందా..?
ఇప్పటికే బీఆర్ఎస్ బీసీలను విస్మరించిందని..52శాతం ఉన్న బీసీలకు కేవలం 23సీట్లను మాత్రమే కేటాయించిందని బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తుంది..?అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హస్తం పార్టీకి రెడ్డి కాంగ్రెస్ అనే ముద్ర ఉంది. ఇప్పుడు అదే కోవలో అభ్యర్థుల ఎంపిక జరిగితే పార్టీకి బీసీలు మరింత దూరం కానున్నారు. అది బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. వీటన్నింటిని పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కొల్లాపూర్ నుంచి డా. కేతూరి వెంకటేష్ పేరు ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
కేతూరికి టికెట్ ఇవ్వాల్సి వస్తే.. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని జూపల్లికి కాంగ్రెస్ నచ్చజెప్పే అవకాశం ఉంది. చింతలపల్లి జగదీశ్వర్ రావు – కేతూరి వెంకటేష్ మధ్య టికెట్ ఫైట్ గట్టిగా నడవనుంది. అయితే.. కొల్లాపూర్ లో 1962 తరువాత ఇప్పటివరకు బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ అంశాన్ని ముందుంచి చింతలపల్లి జగదీశ్వర్ రావుకు నచ్చజెప్పే అవకాశం ఉంది. ఆయనకు కూడా ప్రాధాన్యత కల్గిన పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
Also Read : ఏఐసీసీకి అందిన ఎస్కే టీమ్ నివేదిక – ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..!?