“గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి. ప్రజల సమస్యలను వింటూ అక్కడిక్కడే పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ చూరగొన్నారు. ఆయన చేసే ఈ కార్యక్రమానికి యూట్యూబ్ చానెల్స్ లో మంచి వ్యూయర్ షిప్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ వీడియోలను చూసి మాకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండేదని అనుకున్నారు ఇంతకాలం. తాజాగా ఆయన కబ్జా బాగోతాన్ని నారా లోకేష్ బయట పెట్టడంతో ఈయన కూడా ఇంతేనా అనుకుంటూ ఈసడించుకుంటున్నారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం ఖాళీ జాగాల అన్వేషణ కోసమా అంటూ కేతిరెడ్డి గురించి ప్రజలు చర్చించికుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే…ఓ అందమైన ప్రదేశంపై మనస్సుపడిన కేతిరెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఆ స్థలం మామూలుది కాదు. భూతల స్వర్గాన్ని తలపించేలా ఆ లొకేషన్ ఉంది. అందుకే ఎమ్మెల్యే మనస్సు పడింది. చెరువును కూడా కబ్జా చేసి మంచి డిజైనింగ్ తో ఇంటి నిర్మాణం చేయించారు. ఓ వైపు నీరు ఉంటుంది. మరోవైపు తోట ఉంటుంది. ఒడ్డున ఎమ్మెల్యే ఇల్లు ఉంటుంది. సినీతారలు కూడా కుళ్ళుకునేలా ఇంటి నిర్మాణం చేసుకున్నారు ఎమ్మెల్యే. ఇల్లు నిర్మాణం అందంగా ఉండటంలో తప్పేలేదు కానీ ఆ స్థలం కబ్జా చేసిందని నారా లోకేష్ ఆరోపించారు.
నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెరువును కేతిరెడ్డి కబ్జా చేసి కట్టిన ఇల్లును డ్రోన్ కెమెరాతో షూట్ చేసి మరీ చూపించారు. ఎందుకు ఎమ్మెల్యే తన ఇంటిని ఎవరికీ కనిపించకుండా ప్రహరీ గోడలను నిర్మించుకున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కబ్జా చేశాడని నిరూపించేందుకు నేను సిద్దంగా ఉన్నానని.. తనతో కేతిరెడ్డి చర్చకు సిద్దమా అంటూ లోకేష్ సవాల్ విసిరారు. ఇప్పుడు నారా లోకేష్ బయటపెట్టిన కేతిరెడ్డి ఇల్లు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే పైకి కనిపించడు కాని ఆయన మంచి టెస్ట్ ఉందని సెటైర్లు వేస్తున్నారు.
కేతిరెడ్డిని గుడ్ మార్నింగ్ లో చూసి ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అనుకున్నాం కానీ అందరిలాగే ఈయన అని గ్రహించలేకపోయమని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన గురించి తెగ ప్రమోషన్స్ చేయించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అభిమానం చాటున ధర్మవరంలో కబ్జాలు ప్రారంభించారు.ఆయనకు ఎలాంటి వ్యాపారాలు కూడా లేవు కానీ వందల కోట్లతో ఇల్లు నిర్మాణం.. ఆస్తులు మాత్రం తెగ సంపాదించుకున్నాడంటే.. కేతిరెడ్డి కితకితలు మామూలుగా లేవన్నమాట.