కొన్నాళ్ళుగా కేసీఆర్ తో సన్నిహితంగా మెదులుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కు ఆహ్వానం అందని విపక్షాల భేటీకి కేజ్రీవాల్ హాజరు కావడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొన్ని అనుభవాలతో కేజ్రీవాల్ కన్ను తెరిచారని..బీఆర్ఎస్ తో కలిసి సాగేందుకు ఆయన అనాసక్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి.
ఆప్ కు ఎన్నికల సమయంలో ఎన్నికల ఫండ్ ఇచ్చిన కేసీఆర్ తో దోస్తీని కేజ్రీవాల్ ఇంత తొందరగా ముగిస్తారా..? ఛాన్స్ లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. ఖచ్చితంగా కేసీఆర్ ను కాదని విపక్షాల కూటమిలో కేజ్రీవాల్ ఉండరని చెప్పుకొచ్చారు. అందుకు తాజా ఉదాహరణ విపక్షాల భేటీ ముగిసిన తరువాత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి సరిగా లేదని.. విపక్షాలు నిర్వహించే తరువాతి భేటీలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన బీఆర్ఎస్ తో జత కట్టేందుకు దీనినొక అస్త్రంగా ఉపయోగించుకొనున్నారన్న విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ తాజా మాజీ డిప్యూటీ సీఎంను జైల్లో వేసిన అధికారులు నెలల తరబడి అవుతున్నా బెయిల్ కూడా ఇవ్వడం లేదు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేసేలా హడావిడి చేసినా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ లో బీఆర్ఎస్ తో దోస్తీపై అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఈ కారణంతోనే ఆ మధ్య వరకు కేసీఆర్ తో కలిసి మెలిసి తిరిగిన కేజ్రీవాల్ ఇప్పుడు రూట్ మార్చేసి పట్నాలో జరిగిన మీటింగ్ కు హాజరయ్యారని చెబుతున్నారు.
Also Read : కాంగ్రెస్ కు మేలు చేస్తోన్న బీఆర్ఎస్ , బీజేపీ – ఎలాగో తెలుసా..?