ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఎంపీలకు స్పష్టత ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించారు కేసీఆర్. పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, యూసీసీ వంటి అంశాలపై చర్చ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో కేసీఆర్ సొంత పార్టీ ఎంపీలకు క్లారిటీ ఇవ్వలేదు. కాని బీసీ, మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు.
ఆయా బిల్లులు సభలో చర్చకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందామని.. మీతో టచ్ లో ఉంటానని కేసీఆర్ ఎంపీలతో అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎంపీలతో సమావేశమై పార్టీ వ్యూహాన్ని ముందే ఖరారు చేసుకునే కేసీఆర్ మొదటిసారి వేచిచూసే ధోరణిని అవలంభిస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి మద్దతుగా నిలవకపోతే ఏం జరుగుతుందో కేసీఆర్ కు తెలుసు. బీజేపీకి మద్దతుగా నిలిస్తే మోడీకి సాగిలపడ్డారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పరిస్థితిలు మారాయి. అందుకే ముందస్తు నిర్ణయాలు, వ్యూహాలను తీసుకోవడం అటుంచి.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమనే ధోరణితో కేసీఆర్ కనిపిస్తున్నారు. అందులో భాగమే పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహాన్ని ఫిక్స్ చేయకపోవడం.
Also Read : కవితకు ఈడీ నోటిసులు -ఈసారి అరెస్ట్ జరగనుందా..?