మంత్రి మల్లారెడ్డిని సాగనంపెందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయా..? మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు హటాత్తుగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి కారణమేంటి..? కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? మల్లారెడ్డిపై అసంతృప్తి వెళ్ళగక్కాలని ప్రగతి భవన్ నుంచే ఎమ్మెల్యేలకు గైడ్ లైన్స్ అందాయా..? తెలియాలంటే ఈ పూర్తి కథనం చదవాల్సిందే.
Also Read : మంత్రి మల్లారెడ్డిపై కేసీఆర్ సీరియస్..?
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా గ్రేటర్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అరికపూడి గాంధీ, వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావులు భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రి తీసుకెళ్తున్నారంటూ ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు ఈ సమావేశం నిర్వహించామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇన్నాళ్ళు మంత్రి ఒంటెత్తు పోకడలపై ఏనాడూ నోరు మెదపని ఎమ్మెల్యేలు సడెన్ గా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డిని వ్యతిరేకించడమంటే దాదాపు కేసీఆర్ ను వ్యతిరేకించడమే. అంతలా వారి మధ్య సాన్నిహిత్యముంది. అయినా, ఎమ్మెల్యేలు మల్లారెడ్డిని సవాల్ చేస్తూ భేటీ అయ్యారంటే దీని వెనక ఎవరో ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి.
అయితే, ఎమ్మెల్యేల భేటీ వెనక మరెవరో కాదు ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జా ఆరోపణలు లెక్కే లేదు. మెడికల్ కాలేజ్ భవన నిర్మాణాలపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన ఇంట్లో ఈడీ దాడులు కూడా చేసింది. తనకేమైనా అయితే కేసీఆర్ చూసుకుంటారన్న అతి విశ్వాసంతో మల్లారెడ్డి ఈడీ అధికారులతో మితిమీరి ప్రవర్తించారు. ఈ వ్యవహారం కేసీఆర్ కు చిక్కులు తెచ్చిపెట్టింది.
ఇకపోతే, ఎటు చూసిన వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి గెలవడం అసాధ్యమని కేసీఆర్ కు అందిన నివేదికలోనూ స్పష్టమైంది. ఇదిలా ఉండగానే, ఆయన అల్లుడు బీజేపీలోకి టచ్ ఉన్నాడన్న వార్త తెలిసి.. మంత్రి మల్లారెడ్డిని కూడా దూరం పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారట. ఇందులో భాగంగానే మల్లారెడ్డిపైకి ఎమ్మెల్యేలను కేసీఆర్ ఉసిల్పారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : కవిత అరెస్ట్ తథ్యం – మరి బీజేపీపై బీఆర్ఎస్ బాస్ ఏం చేయనున్నారు..?