ఆరు నెలల ముందుగా ఎన్నికలు జరిగితే వాటిని ముందస్తు ఎన్నికలు అనరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ గడువు ముగిసే ఆరునెలల ముందు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చు. దీని ఆధారంగా ఆరు నెలలలోపు ఎన్నికలు జరిగితే అది ముందస్తుగా పరిగనించబడదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్ కు షాక్ – గజ్వేల్ లో ఈసారి ఎదురీతే..?
షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. కేసీఆర్ చెప్పినట్లుగా షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరుగితే… ఎన్నికలకు ఇంకో పదమూడు నెలల సమయమున్నట్లు. కాని కేసీఆర్ మాత్రం మూడు నెలల సమయం కుదించి ఇంకో పది నెలల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికలుండవని చెప్తూనే..మూడు నెలల ముందుగానే ఎన్నికలన్నట్లు కేసీఆర్ చెప్పడంతో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. వచ్చే ఆరు నెలలో తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసే అవకాశం ఉందని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు.
టీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి తుమ్మల, జూపల్లి..!?
వచ్చే నెల నుంచి కేసీఆర్ తన రాజకీయ చతురతకు మరింత పదును పెట్టనున్నారు. ఎందుకంటే డిసెంబర్ లో బీఆర్ఎస్ కు అనుమతి వస్తుంది. దాంతో బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకేళ్ళెందుకు ఆయన మరింత శ్రమించనున్నారు. కేసీఆర్ ఇమేజ్ మరింత పెరగాలంటే రాష్ట్రంలో మరోసారి నెగ్గాల్సి ఉంటుంది. అందుకోసం ఆరు నెలల తరువాత కేసీఆర్ ముందస్తును కోరే అవకాశం ఉందని గులాబీ నేతలు గుసగుసలాండుకుంటున్నారు.