కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వృద్దులు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగానే బీఆర్ఎస్ అప్రమత్తం అయింది. 44లక్షల మంది వృద్దుల ఓటు బ్యాంక్ చేజారిపోకుండా ఉండేందుకు ప్రస్తుత పెన్షన్ ను డబుల్ చేస్తామని హామీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎంత ఆర్థిక భారం పడుతుంది..? అనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు.
నిజానికి ఆసరా పెన్షన్ ను 3,016కు పెంచాలని బీఆర్ఎస్ తొలుత భావించింది. కాంగ్రెస్ నాలుగు వేలు ఇస్తామని ప్రకటించడంతో బీఆర్ఎస్ కూడా ఆసరా పెన్షన్ ను పెంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆసరా పెన్షన్ కోసం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఒకవేళ పెన్షన్ ను 4000 ఇవ్వాలనుకుంటే ప్రతి సంవత్సరం 24వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2018ముందస్తు ఎన్నికల హామీల విషయంలో పెన్షన్ ను 2వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ కూడా తాము అధికారంలోకి వస్తే పెన్షన్ ను 2,016ఇస్తామని మ్యానిఫెస్టోలో చేర్చారు కానీ సంవత్సరం తరువాత నుంచి అమలు చేశారు. ఇప్పుడు కూడా పెన్షన్ ను కాంగ్రెస్ పెంచుతామని ప్రకటించడంతో బీఆర్ఎస్ లో కొంత ఆందోళన కనిపిస్తోంది. న్యూట్రల్ ఓటు బ్యాంక్ గా ఉండే వృద్దుల ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా పెన్షన్ ను పెంచాలని, మ్యానిఫెస్టోలో చేర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Also Read : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికే..!!