రూ . 800 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని యశోదా ఆసుపత్రి వాళ్లకు రూ . 100 కోట్లు అమ్మి కెసిఆర్ డబ్బులు దండుకున్నారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న మీడియాముందు ఆరోపించారు. మాములుగా ఆరోపించ కుండా దానికి తగిన ఆధారాలు, డాకుమెంట్లు చూపడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది.
నిన్నటివరకు రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగిన కెసిఆర్, ఇప్పుడు ఆ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్లు ఒక్కసారిగా ‘తుస్సు’ మన్నట్లు మౌనం వహించారు. దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం దీనిని ఖండించనూ లేదు. ఈ మౌనం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఎందుకు మౌనం వహిచారో చూడాలి. మౌనం అర్థ అంగీకారం కావచ్చు. కానీ రాజకీయ నాయకులు అంత తొందరగా లొంగుతారా?
కెసిఆర్ ఇప్పుడిప్పుడే బిఆర్ఎస్ పార్టీని జాతీయ స్టాయికి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్తిలో ఏఒక్క కుంభకోణం బయటపడినా ఆదిలోనే హంసపాదు అవుతుంది. దీనికి తోడూ ‘డిల్లి లిక్కర్ స్కాం’ లో కవిత ఇరుక్కున్న విషయం తెల్సిందే. ఆమెను ఆ కేసులోంచి ఎలా బయటపడేయాలి అనే విషయంలో సతమతమవుతున్నారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ‘యశోదా ఆస్పత్రి’ భూ కుంభకోణం తెరమీదికి వచ్చింది. కెసిఆర్ ఏ కుంభకోణం చేయకుండానే జాతీయ పార్టీ పెడుతున్నారు అంటే ఎవ్వరు నమ్మరు.
ఇది మిగతా ఆరోపణలలాగా గాలికి చెప్పిన మాటలు కావు. రేవంత్ రెడ్డి ఈసారి పక్కా ఆధారాలతో ఆరోపించారు. దీని మీద సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తే మాత్రం కెసిఆర్ చిక్కులో పడతారు. తన కూతురిని కాపాడే పనిలో తాను కూడా కుంభకోణం ఉబిలో పుడుకుపోయే ప్రమాదం ఉన్నదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.