ఒకప్పుడు అభివృద్ధి చెందిన నగరాల భూములను రాజకీయనాయకులు ఆక్రమించేవాళ్లు. ఇది అవుట్ డేట్ ఆక్రమణలు. ఇప్పడు పేద రైతుల భూములను ముందుగా ఆక్రమిస్తున్నారు. తర్వాత ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఆ భూముల ధరలు అమాంతం పెంచేయడం కొత్త ట్రెండ్.
దీనికి మూల పురుషుడు నారా చంద్రబాబు నాయుడు. నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ముందుగా శంషాబాద్ లోని రైతుల భూములను ఎకరానికి చాలా తక్కువ ధరలో (వేలల్లో) జయాబేరి కె. మురళి మోహన్ తో బినామిగా కొనిపించారు. ఆ తర్వాత అక్కడ అంతర్జాతీయ విమానశ్రయం రాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో కె. మురళి మోహన్ ఆ భూములను ఎకరానికి కోట్లల్లో అమ్ముకున్నారు. ఇదే స్కీంని మొన్ఆంన ధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి ‘అమరావతి’ రాజధానిగా ప్రకటించారు. ఇప్పడు జగన్ కూడా వైజాగ్ లో భూములు కొని దానిని రాజధానిగా ప్రకటించారు.
తెలుగుదేశం నుంచి అక్రమ పసుపు రంగు పూసుకుని వచ్చిన కెసిఆర్ కూడా ఇదే పద్దతిని అమలు చేస్తున్నారు. ఆయన ముందుగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలల్లో వేల ఎకరాల భూములు చాలా తక్కొకువ ధరలకు కొన్నారు. ఆ తర్యాత దగిరిగుట్టాను అభివృద్ధి చేసి ఆ భూములను కోట్లకు అమ్ముకున్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భక్తీతో పాటు ముక్తి కూడా ఉంది. ఆయన గొప్ప విజయం సాదించారు.
ఇప్పడు అదే స్కీంను ఓ స్కామ్ లాగ మార్చి మరోసారి కొండగట్టు ఆంజనేయుడి మీద పడ్డారు. అని బిజెపి ప్రధాన ఆరోపణ, ఆయన కూతురు కవిత, అల్లుడు, మరదలు కొడుకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావుతో ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో వెలాది ఎకరాలు పొలాలను ‘కారు’ చవకలో కొన్నారు అని బిజెపి మరో ఆరోపణ. ‘వీళ్ళకు పిచ్చి పట్టిందా? ఇక్కడ ఏం పంటలు పండుతాయని వేల ఎకరాలు కొంటున్నారు?’ అని అక్కడివాళ్లు ముక్కున వేలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు కెసిఆర్ తన అసలు రంగు బయట పెట్టే సరికి ముక్కు మీద గుద్దినట్లు ఉంది. కెసిఆర్ ముక్కులా అందరి ముక్కులు వాచాయి.
ఉరుములు లేని పిడుగులా ఒక్కసారిగా కొండగట్టు ఆంజనేయుడి మీద పడ్డారు. ఉన్న పళంగా 100 కోట్లు దానం చేశారు. అది సరిపోదు అన్నట్లు ఆలయాన్ని దర్శించుకుని వరాలజల్లు కురిపించారు. ఆలయం అభివృద్దికి 500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, అవసరమైతే వెయ్యి కోట్లు కూడా విడుదల చేస్తానని ప్రకటించారు.
ఎందుకు ఇవ్వరు సార్? మీ రియల్ఎస్టేట్ వ్యాపారం పెంచుకోడానికి మీ రియల్ క్యారెక్టర్ ఎందుకు బయటపెట్టరు? ప్రభుత్వం సొమ్ము ను ఎందుకు దానం చేయరు?
ఇప్పుడు జోగినపల్లి సంతోష్ రావు మరో అడుగు ముందుకేసి అక్కడి వెయ్యి ఎకరాలు తీసుకుని హరితహారం అభివృద్ధి చేస్తాను అని ప్రకటించారు. అంటే హరితహారం పేరుతో టేకు, గందం చెక్కల చెట్లు పెంచి కోట్లు దండుకోవాలని కుట్ర లా కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ పేరు చెప్పి, రాజధానుల పేరు చెప్పి దోచుకున్న నాయకులను చూసాము. కానీ చివరికి ఇలా దేవుడి పేరు చెప్పి దోచుకునే నేత కెసిఆర్ ని తొలిసారి చూస్తున్నాము అని బిజెపి ఆరోపణ నిజమే అనిపిస్తోంది.