ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎనిమిదో వార్డు లోని బొల్లారం డౌటన్ బజార్ లోని రాజాజీ ఇన్స్టిట్యూట్ లో వెయ్యి పడకల టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్న ప్రదేశాన్ని సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శంబీపూర్ రాజు గారు. మరియు ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంతరావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే కంటోన్మెంట్ ముద్దుబిడ్డ శ్రీ సాయన్న గారితో మరియు మల్కాజిగిరి టిఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి 26 తారీకు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే భూమి పూజ కార్యక్రమ స్థలాన్ని సందర్శించడం జరిగింది . 26 వ తేదీ నాడు తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల
చంద్రశేఖర రావు గారిచే భూమి పూజ కార్యక్రమం ఉంటుందని ,ముఖ్యమంత్రి గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించడానికి 900 కోట్ల మంజూరు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజలపక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది . ఈ ఆస్పిటల్ లో నిర్మించడం వలన ఇటో కంటోన్మెంట్ ప్రజలకు మల్కాజ్గిరి ప్రజలకు మెడిచల్ ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు నివేదిత గారు మరియు బోయిన్పల్లి మార్కెట్ ఎక్స్ చైర్మన్
టి. ఎన్ .శ్రీధర్ శ్రీనివాస్ గారు కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డీ మరియు మాజీ బోర్డ్ సభ్యులు ప్రభాకర్, నళిని కిరణ్ , లోక్ నాథ్ , శ్యామ్ కుమార్ , హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, TSMSIDC ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, మరియు తిరుమలగిరి ఎమ్మార్వో హసీనా బేగం, బేగంపేట ఎసిపి నరేష్ రెడ్డి తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ రవికుమార్ , బొల్లారం సిఐ శ్రీధర్, అల్వాల్ సిఐ గంగాధర్ గారు మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు .*