తెలంగాణ ఏర్పడిన తరువాత రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ పునరేకీరకరణ పేరుతో టీడీపీని ఖతం చేశారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేయాలని కోవర్ట్ ఆపరేషన్ లు కూడా చేశారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. అది కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా. నేతలంతా కేసీఆర్ ను ఓడించేందుకు రైట్ చాయిస్ గా కాంగ్రెస్ ఎంచుకుంటున్నారు. గతంలో ఏ పేరైతే చెప్పి ప్రతిపక్ష పార్టీలను దారుణంగా కేసీఆర్ దెబ్బతీశాడో.. ఇప్పుడు దాన్నే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై ప్రయోగిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ లోకి చేరికలు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే అంతెత్తున లేచే నేతలు సైతం కేసీఆర్ ను డీకొట్టేందుకు హస్తం పార్టీలో జాయిన్ అవుతున్నారు. కారణం.. ఒకే ఒక్క ఎజెండా. తొమ్మిదేళ్ళుగా తెలంగాణ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దగా చేసిండని..అమలు చేయని హామీలతో ప్రజలను వెర్రిపుష్పాలు చేశాడంటూ నేతలు కన్నెర్ర జేస్తున్నారు. ఆ మధ్య కాలంలో బీజేపీతోనే బీఆర్ఎస్ ను ఓడించగలుగుతామని నేతలంతా కమలం కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కూడా వ్యూహమో మరేమిటో తెలియదు కానీ చర్చలోకి కాంగ్రెస్ ను తీసుకురాకుండా బీజేపీని పదేపదే చర్చలో నిలిపేవారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అవహగన కుదిరినట్లు సంకేతాలు కనడుతుండటంతో ..రాజకీయ పునరేకీరణలో భాగంగా గతంలో బీఆర్ఎస్ లో చేరిన నేతలంతా కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారు.
ఖమ్మం, నల్గొండ జిల్లాలో బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరడంతో ఈ రెండు జిల్లాలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాపై ఫోకస్ పెట్టిన హస్తం నేతలు..ఆ జిల్లాలో కూడా బలమైన నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ మూడు జిల్లాలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.
Also Read : ఈటల సన్నిహితుల పక్కచూపులు – ఆ ఇద్దరూ మోసపోయారా.?