రాజకీయాలలో ‘శవరాజకీయాలు’ వేరు. అంటే సామాన్యంగా ఓ మనిషి చనిపోతే అతని కులం, గోత్రం మతం, దేశం చూడరు. చుసేదల్ల ఒక్కటే. చనిపోయింది సాటి మనిషి అని. అది కూడా చూడలేక తమ కుటిల రాజనీతిని చుపేదే ‘శవరాజకీయం’. కెసిఆర్ అన్ని విషయాల్లో రాజకీయం చేస్తారని అందరికీ తెలుసు. కానీ శవరాజకీయం కూడా చేస్తారని సోమవారం తెలిసింది.
ప్రముఖ రాజకీయవేత్త, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఏమ్మెల్లె జి. సాయన్న చనిపోతే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇది కెసిఆర్ చేయవలసిన మెహర్బానీ కూడా కాదు. అది ప్రభుత్వం నిబంధన. తప్పనిసరి చేయాలి. కానీ సొంత పార్టీ వాడిని కూడా కాదని కెసిఆర్ తన ఇష్టారాజ్యంగా ‘వద్దని’ అధికారులతో చెప్పినట్లు తెలిసింది.
దాంతో చావుకు వచ్చిన తలసాని, మల్లారెడ్డి మొక్కుబడిగా ఓ దండ వేసి, ఓ దండం పెట్టి జారుకోబోయారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరపడానికి విలుకాదని చావు కబులు చల్లగా చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ”మా సాయన్న దళితుడు కాబట్టి చులకనా? అగ్ర కులాల వాళ్ళ చస్తే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేస్తారు. మరి ఆ గౌరవం మాకు దక్కదా? మా దళితుల పట్ల ఇంకా ఇన్నాళ్ళు ఇలా వివక్ష చూపుతారు?” అని నిలదేశారు.
అది చిలికి చిలికి గాలివానలా మారి దళిత సంఘాలకు పాకేలా కనిపించింది. అందుకే మంత్రులు హుటాహుటినా కెసిఆర్ కి ఫోన్ చేసి ”మనం తెగేంతవరకు లాగితే దళితుల ఓట్లు మనకు దక్కవు” అని హితవు చెప్పి ఉంటారు. వెంటనే కెసిఆర్ ఓ మెట్టు దిగి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేసి చావండి అని ఆదేశించారు కాబోలు. మంత్రులు కుటుంబ సభ్యులను శాంతింపజేసి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.
పరిస్టితి చూస్తే కుటుంబ సభ్యుల ఆరోపణ నిజమే అనిపిస్తోంది. సాయన్న ఐదుసార్లు ఏమ్మేల్లెగా గెలిచారు. చాలా సీనియర్ నాయకులు. అయినా అతనికి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు కెసిఆర్. దానికి కారణం మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. సాయన్న అజాత శత్రువు. ఎవ్వరిని బాధపెట్టారు. ఎవ్వరిని నిలదీసి ఇది ‘నాకు కావాలని’ అడగరు. అందుకే పదవుల పరంగా ఆయనను కెసిఆర్ నొక్కేసారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం లేదు.
సినిమా వాళ్లు చనిపోతే అందరికంటే ముందు దగ్గరుండి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయిస్తుంది. మంచిదే. కానీ దాంట్లో కూడా మానవత్వం కంటే రాజకీయమే కనిపిస్తుందో. సినిమా వాళ్ళ అంత్యక్రియలు చేస్తే ఇక్కడున్న ఆంధ్రల ఓట్లు పడతాయి కాబట్టి. రాజకీయనాయకులు తమకు లాభం లేనిదే ఎలాంటి రాజకీయం చేయరు. కానీ ఇలా శవరాజకీయాలు కూడా చేయాలా??? చివరికి శవం మీద కప్పిన కండువాతో తల పాగా కట్టుకోవాలా?