ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు జారీ చేయడంతో తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడు లేని విధంగా హాట్, హాట్ గా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గురువారం క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగుతోంది. ఈ సమావేశంలో కవితకు ఈడీ నోటిసులు… అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.
కవితకు ఈడీ నోటిసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు అవుతున్నారు. తాజాగా జరగనున్న సమావేశంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని కొత్త వాదన తెరపైకి వస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ మొగ్గు చూపనున్నారని…ఈ విషయమై పార్టీ నేతలకు ముందస్తు సంకేతాలు ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతుందని.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే కవిత అరెస్ట్ అని చెప్పనున్నారనే చర్చ జరుగుతోంది. తద్వారా తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని…లిక్కర్ స్కామ్ లో ఎలాంటి పరిణామాలు జరిగినా దానిని రాజకీయంగా వినియోగించుకునేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే ఆయన ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు.
Also Read : ఏందీ శీనన్నా…కవితను కాపాడలనుకుంటున్నావా..? ఇరికించాలనుకుంటున్నారా..?