రెండో దఫా ప్రభుత్వంలో చేయాలనుకున్న టాస్క్ లను దాదాపుగా కంప్లీట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు తన దృష్టినంత ఎన్నికలపై కేంద్రీకరించబోతున్నారు.
కొత్త సచివాలయం, జిల్లాలో సమీకృత కలెక్టర్ల నిర్మాణాలు , హైదరాబాద్ లో 40ఫ్లై ఓవర్లు , కమాండ్ కంట్రోల్, టీ వర్క్స్, టీ హబ్ వంటివి ప్రరంభించేసిన కేసీఆర్… ఇప్పుడు ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే సర్వే బృందాలను రంగంలోకి దించారు. స్వయంగా కేసీఆరే ఇరవై ప్రశ్నలను రూపొందించి ప్రజల పల్స్ తెలుస్కోవాలని సర్వే టీమ్ ను ఆదేశించారు. వీటి ఆధారంగానే సర్వే బృందాలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని కేసీఆర్ కు తుది నివేదిక సమర్పించనున్నారు. మోదటగా గెలుపుపై సందేహమున్న నియోజకవర్గాల్లో సర్వే బృందాలు పనిని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ రూపొందించిన క్వశ్చనీర్ ఆధారంగా సర్వే బృందాలు ప్రజల నాడిని పసిగట్టనున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది..? మరోసారి టికెట్ ఇవ్వోచ్చా..? టికెట్ ఇస్తే గెలుస్తారా..? సిట్టింగ్ శాసన సభ్యుడికి కాకుండా మరో బీఆర్ఎస్ నేతకు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి..? ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారా..? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా..? ఇలా 20ప్రశ్నలను ప్రజల ముందుంచి సమాధానం రాబట్టి కేసీఆర్ కు సర్వే రిపోర్ట్ ను అందజేయనున్నారు. ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో ఎలాంటి ఫలితం వస్తుందోనని టెన్షన్ ఫీల్ అవుతున్నారు.
మరోవైపు ఇదే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా జనాల స్పందన ఎలా ఉందొ తెలుసుకుంటున్నాయి సర్వే బృందాలు. రూ.1లక్ష రైతు రుణమాఫీలో జాప్యం జరుగుతుండటంతో అసంతృప్తిగా ఉన్నారా..? గృహలక్ష్మి పథకానికి మూడు లక్షల సర్కార్ సాయం సంతృప్తికరంగానే ఉందా..? ఇంటింటికి తాగునీరు అందుతుందా..? వృద్దులైతే పెన్షన్ అందుతుందా..? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కొనసాగాలనుకుంటున్నారా..? ఇలా పలు అంశాలపై ప్రజల ఒపినియన్ సేకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సర్వే ముగియనుంది. అనంతరం తుది నివేదికను కేసీఆర్ టేబుల్ మీద ఉంచనున్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వడం జరుగుతుందని కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలోనే స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్ పట్టుకుంది.
అయితే ఇప్పటివరకు సర్వే ఫలితాలు బీఆర్ఎస్ కు కొంత మోదం, కొంత ఖేదంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు టికెట్ గల్లంతు కానుందని అంటున్నారు. ఈ నలభై నియోజకవర్గాల్లో కొత్త మొహాలకు అవకాశం ఇస్తారని సమాచారం.
సర్వే బృందాలు ఏయే ప్రాంతాల్లో పని చేస్తున్నాయంటే..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : మంచిర్యాల , సిర్పూర్ , చెన్నూరు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ , నిజామాబాద్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా : జగిత్యాల , ధర్మపురి , మానకొండూరు.
మెదక్ జిల్లా : నారాయణ్ ఖేడ్ , పటాన్ చెరు, నర్సాపూర్.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : మేడ్చల్, తాండూర్ , ఎల్బీ నగర్ .
హైదరాబాద్ జిల్లా : ఖైరతాబాద్, అంబర్ పేట్.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా : అచ్చంపేట , కల్వకుర్తి.
ఉమ్మడి నల్గొండ జిల్లా : కోదాడలో , తుంగతుర్తి.
ఉమ్మడి వరంగల్ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ ,డోర్నకల్లో, జనగామలో .
ఖమ్మం : పినపాక , కొత్త గూడెం, పాలేరులో బీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ అనుమానంగా ఉన్నారు. అందుకే మొదట సర్వేలు పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read : ఆ 40 మంది సిట్టింగ్ లకు టికెట్ గల్లంతే – షాక్ ఇవ్వనున్న కేసీఆర్..!?