రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నమంటే దానికి ఓ సాధికారిత ఉండాలి. ఎందుకంటే ప్రతిది రికార్డ్ అవుతుంది. పోరపాటుగా కూడా నోరు జారి అబద్దం మాట్లాడిన ఇరుకున పడాల్సి వస్తుంది. అందుకే సీఎంగా అత్యంత జగురుకతతో మాట్లాడాలి. కాని తెలంగాణ ముఖ్యమంత్రికి నిజాలు మాట్లాడటం అలవాటు ఉండదు కదా. అందుకే అబద్దాలను అంద్నగా ప్రెజెంట్ చేస్తున్నారు. స్వరాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పుకున్నారు.
నిజంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవా..? రోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నది రైతులు కాదా..? వారు రైతులు కాకపోతే మరెవరు..? తెలంగాణలో నిజంగానే రైతులు పండగ చేసుకుంటున్నారా..? కేసీఆర్ తన జాతీయ రాజకీయ అవసరాల కోసం అవునని అంటున్నారు. కాని వాస్తవ గణాంకాలు మాత్రం విరుద్దంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు భారీ స్థాయిలోనే నమోదు అయ్యాయని తేల్చింది. 2014- 20వరకు తెలంగాణలో 6121మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పొలిసు శాఖ వెల్లడించింది. మన దొరగారేమో నిసిగ్గుగా అబద్దాలు మాట్లాడేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు ఆత్మహత్యలు లేని ఎకైక రాష్ట్రం తెలంగాణ అని తనకు తోచినట్టుగా మాట్లాడారు.
రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చాక రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ నేతలు పదేపదే చెప్పుకుంటున్నారు. కాని రైతు బంధు పథకం కూడా రైతులకు భరోసా ఇవ్వలేకపోయింది. రైతు బంధు పథకం వచ్చాక రెండు వేల మందికి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతెందుకు ఈ నెలలో 11మంది రైతులు బలవన్మరణం చేసుకున్నారు.
కాని కేసీఆర్ మాత్రం మా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు లేవని చెప్పుకున్నారు. ఓడిశా మాజీ సీఎం బీఆర్ఎస్ కి చేరిక సందర్భంగా జాతీయ మీడియా కవరేజ్ ఉంటుందని అనుకున్నారు. అందుకే పచ్చి అబద్దాలు మాట్లాడేశారు. కేసీఆర్ అబద్దాల జాతర ఇవాల్టి కాదులే తెలంగాణ ఉద్యమం నుంచి ఆయనది అదే పంథా. తెలంగాణ ప్రజలను ఆయన ఎంత అమాయకులుగా భావిస్తున్నారో ఈ ప్రకటనతో తేటతెల్లం అవుతుంది.