మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తారుమారు కానుంది. పురుషులకు కేటాయించిన కొన్ని నియోజకవర్గాలను మహిళల అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే, మహిళలకు కేటాయించే స్థానాలను వేటిని ప్రామాణికంగా తీసుకొని రిజర్వ్డ్ స్థానాలుగా ఎంపిక చేస్తారు..? అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా మహిళా రిజర్వ్డ్ స్థానాలను నిర్ణయిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సిందే.
తెలంగాణలో 61నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే అధికంగా ఉన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్ అమలైతే రాష్ట్రంలో 119నియోజకవర్గాలకు గాను 39నియోజకవర్గాల్లో మహిళలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఇచ్చింది కేవలం 7. మహిళా రిజర్వేషన్ అమలైతే ఇంకో 32స్థానాల్లో మహిళలకు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులను మార్చి మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి.. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా మార్పునకు కారణం కానుంది.
కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్.. ఈ రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. సిరిసిల్లలో, సిద్దిపేటలోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అమలైతే బీఆర్ఎస్ లోని ఈ ముగ్గురు మొనగాళ్ళు కొత్త నియోజకవర్గాలను వెతుక్కొని అక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. దాంతో మహిళా రిజర్వేషన్ బీఆర్ఎస్ లో కొత్త బుగులుకు కారణం అయింది.
Also Read : మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం – తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే..!!