ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఎఐజీ ఆసుపత్రికి తరలించారు.అనంతరం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. సిటీ స్కాన్, ఎండో స్కోపీ పరీక్షలు నిర్వహించగా..ఆయనకు అల్సర్ ఉన్నట్లు తేల్చారు వైద్యులు. దాంతో ఆయనకు వైద్యులు చికిత్స ప్రారంభించారు.
మొదట కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. కానీ తరువాత కేసీఆరే అస్వస్థతకు గురయ్యారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం ఆయనను ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.
మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో కేసీఆర్ కు కడుపులో ఇబ్బందిగా అనిపించడంతోనే ఆసుపత్రికి తీసుకెళ్లార నీ అంటున్నారు. మొదట ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించే ఆ తరువాత చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉండొచ్చునని తెలుస్తోంది. ఎండో స్కోపీ టెస్ట్ చేయగా ఆయనకు అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే…కేసీఆర్ ఆరోగ్యం గురించిన వదంతులు వస్తోన్న నేపథ్యంలో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.