కెసిఆర్ కు అస్వస్థత గురికాలేదు? అదో డ్రామా? అని విజయశాంతి సోషల్ మీడియాలో ప్రకటించి సంచలన రేపారు. ”ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అడ్డంగా ఇరుకుంది. ఆమెను మొన్న ఈడి దాదాపు 9 గంగల పాటు విచారించి మైండ్ బ్లాంక్ చేశారు. ఆమె బయటికి వచ్చాకా, మీడియాతో మాట్లాడలేదు. కేటిఆర్ కూడా మీడియా ముందుకు రాలేదు. మీడియా నుంచి తప్పించుకోవడానికే కెసిఆర్ అస్వస్థత గురయ్యినట్లు డ్రామాలు ఆది తప్పించ్కున్నారు” అని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
కెసిఆర్ తో పాటు ఆయన భార్య శోభ కూడా అస్వస్థత గురయ్యినట్లు తెలిసింది. ఆమెకు కూడా రకరకాల వైద్య పరిక్షలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ వార్తను బయటికి చెప్పలేదు. ”ఎందుకు బయటికి చెప్పలేదు? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాటల్డుతూ కేవలం కెసిఆర్ పేరునే జపించడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది అని విజయశాంతి ఆరోపించాడు. ఈడి ఇచ్చిన షాక్ కి అటు కెసిఆర్, ఇటు అయన సతీమణి గుండెలు అధిరాయి. అందుకే ఇద్దరు కలిసి ఆసుపత్రిలో చేరినట్లు కలరిచ్చి మీడియాలోతుకు వెళ్ళకుండా చేశారు అని విజయశాంతి దుయ్యబట్టారు.
”ఇప్పటికివరకు కవిత కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రాలేదు. బిఆర్ఎస్ లో ఉన్న ‘బి’ గ్రేడ్ నాయకులు మాత్రమే కవితకు మద్దత్తుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదు?” అని ఆమె ఆక్షేపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంభ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆయనను పరీక్షించిన డాక్టర్ లు ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అని చెప్పారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని వైద్యబృందం కేసీఆర్ కు అనేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు చెప్పారు.
కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందనీ, మందులతో తగ్గిపోతుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మీడియాతో చ్చేప్పారు. ఇక వైద్య పరీక్షల తర్వాత తిరిగి ప్రగతి భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆస్పత్రికి వచ్చి కెసిఆర్ ఆర్ కి తోడుగా ఉన్నారు.