బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ మార్చే అవకాశం ఉందా..? సిట్టింగ్ లపై భారీగా వ్యతిరేకత ఉన్నప్పటికీ మొండిపట్టుదలకు పోయిన కేసీఆర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారా.? తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చాలని.. లేదంటే బీఆర్ఎస్ కు పరాభవం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కేసీఆర్ వచ్చే ఎన్నికలకుగాను 115మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండటంతో తాను ప్రకటించే హామీలతో వ్యతిరేకత అంత తుడిచిపెట్టుకుపోతుందని లెక్కలు వేసుకున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత భారీగా పెరుగుతుందని నిఘా వర్గాలు నివేదించడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూడా వ్యతిరేకతను తగ్గించుకొని ఎమ్మెల్యేలు ఎవరు..? అని కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం.
సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో వారిపై మరోసారి సర్వే చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ సర్వే చేయించి ఎవరెవరికీ గండం ఉందో తెలుసుకొని వారిని ప్రగతి భవన్ కు పిలిచి సెట్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ 34మందిపై వ్యతిరేకత తగ్గకపోతే వీరందరిని కూడా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన సమయంలోనే కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు.
కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చుతామని చెప్పారు. దాంతో ప్రజామోదం కోల్పోయిన నేతలకు బీ-ఫాం ఇవ్వొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సర్వేలోనే 34నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే స్థానంలో ప్రజామోదం మెండుగా ఉన్న నేత ఎవరు..? అని కేసీఆర్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. దాంతో అక్కడ బలమైన నేతగా ఉన్న నేతను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించనున్నారు. ఆ నేతకు టికెట్ ఆఫర్ చేసి అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు.
Also Read : కాంగ్రెస్ లో చేరేందుకు ఆ నేతలంతా ఆసక్తి ..?