కెసిఆర్ తో మూడు చెరువుల నీళ్ళు తాగించాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై భావించారు. కానీ దానికంటే ముందే కెసిఆర్ ఆమెతో ఏడు చెరువుల నీళ్ళు తాగించాలని సిఎస్ శాంతికుమారితో ఏకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులను ఆమె 4 నెలలుగా పెండింగ్లో పెట్టారు. ఇంకా వాటిని ఆమోదించలేదు. కనీసం వాటిని తిరస్కరించినట్లు కూడా తిప్పి పంపలేదు అన్నది ఆమె మీద మోపిన అభియోగం.
ఆమె ఆమెదం పొందితే కానీ ఆ పది బిల్లులు అమలు చేయలేరు. బిల్లు లో మార్పులు చేర్పులు చెప్పే అధికారం, మరి కొన్ని విశిష్ట అధికారాలు గవర్నర్ కి ఉన్నప్పటికీ ఏదో విషయం వెంటనే తేల్చి చెప్పాలి. ఇలా దాటవేసే పద్దతులు పాటించి కాలయాపన చేయడం మాత్రం మంచిది కాదు అన్నది కెసిఆర్ ప్రాధాన ఆరోపణ.
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివకు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులను అమలు చేస్తే బిఆర్ ఎస్ ఉపే వేరు. కానీ కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ ఆ బిల్లులను ఆపాలని గవర్నర్ని ఆదేశించినట్లు కెసిఆర్ ఆరోపణ. ఇది బిజెపి అమలు చేస్తున్న ‘మిషన్ 90’ లో ఒక భాగం. ఎందుకంటే ఇవి బిఆర్ఎస్ కి ప్రతిష్టను పెంచే బిల్లులు.
ఈ పది బిల్లులల్లో ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన ఉమ్మడి బోర్డు బిల్లులు, మున్సిపాలిటీ చట్టానికి సవరణలు, అజామాబాద్ పారిశ్రామిక అభివృద్ధి చట్టం బిల్లులు గవర్నర్ వద్ద 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. సిఎస్ శాంతి కుమారి ఎన్నిసార్లు గవర్నర్ ని కలిసినా వాటిని లోతుగా పరిశీలిస్తున్నాను అని ఆమె కేర్లెస్ గా జవాబు చెప్పినట్లు ఆరోపణ.
ముఖ్యంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న వాటిలో అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు కీలకమైనది. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టంలో ముడిపడి ఉంది. అందువల్ల ఈ బిల్లుకు మోక్షం రావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగిలిన బిల్లులు అమలు కావాలంటే గవర్నర్ ఆమోదించాలి.
ఇప్పుడు తమిళ సై ఈ కేసులోంచి తప్పించు కోవాలంటే ఆ 10 బిల్లులను వెంటనే ఆమోదించాలి. లేదా ఆ బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందో తగిన కారణలు సుప్రీం కోర్ట్ చూపాలి. అవి సుప్రీం కోర్ట్ నమ్మేవిదంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆమె చిక్కుల్లో పడతారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.