ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర కూడా ఉందా..? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించిన సీబీఐ ఏయే అంశాలపై ఆయన్ను ప్రశ్నించిందో స్పష్టత లేదు కానీ కేసీఆర్ – అరవింద్ కేజ్రీవాల్ మధ్య నెలకొన్న రాజకీయ – ఆర్ధిక బంధాలపై ఆరా తీసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పరిచయాల నుంచి ఆర్ధిక సహాయం అందించుకునే వరకు ఎలా వచ్చిందనే కోణంలో కేజ్రీవాల్ నుంచి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆప్ కు బీఆర్ఎస్ ఎందుకు ఆర్ధిక సహాయం అందించిందని సీబీఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించినట్లు పేర్కొంటున్నారు.
గత కొన్నాళ్లుగా ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్ ఆర్ధిక సాయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆప్ కూడా కేసీఆర్ ఆర్ధిక సహాయం చేశారని అంటున్నారు. అందుకే కేసీఆర్ ఇన్వైట్ చేసినప్పుడుల్లా తెలంగాణలో పర్యటనలకు ఆప్ నేతలు వస్తున్నారనే ప్రచారం ఉండనే ఉంది. పంజాబ్ , గోవా ఎన్నికల్లో కేసీఆర్ ఆప్ కు ఎన్నికల ఫండ్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై ఆప్ అధినేతను సీబీఐ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆప్ తో బీఆర్ఎస్ కు బలమైన బంధం ఏర్పడటానికి ఆర్ధిక సంబంధాలేనని ఓ నిర్ణయానికి వచ్చిన సీబీఐ… ఈ ఆర్ధిక సంబంధాలు ఎలా ఏర్పడ్డాయో తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ అంశమే అటు ఢిల్లీ, ఇటు హైదరబాద్ లో సంచలనంగా మారింది.
ఇన్నాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మాత్రమే వినపడింది. ఆప్ నేతలతో కలిసి కవిత లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. కవితను మూడుసార్లు ఈడీ విచారించింది. సీబీఐ ఓ సారి విచారించింది. ఈ క్రమంలోనే సీబీఐ కేసీఆర్ తో అరవింద్ కేజ్రీవాల్ బంధంపై ప్రశ్నించడంతొ అసలు ఈ కేసులో మరిన్ని కీలక ట్విస్ట్ లు ఉంటాయోనని రాజకీయ విశ్లేషకులు సైతం ఓ అంచనాకు రాలేకపోతున్నారు. లిక్కర్ స్కామ్ లో అటు కవిత పాత్రపై ఈడీ విచారణ జరుపుతుండగా…ఇటు సీబీఐ కేసీఆర్ పాత్ర ఏంటో తేల్చే పనిలో ఉన్నట్లుగా తాజాగా స్పష్టం అవుతోంది.
Also Read : కేసీఆర్ ఫ్యామిలీ భూకుంభకోణం – రాజకీయాల్లో రేవంత్ సంచలనం