రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సిన వాడు ఎదుగుతాడు అనేది నానుడి. దీనిని పక్కాగా ఆచరణలో పెడుతున్నారు సీఎం కేసీఆర్. ఇన్నాళ్ళు గవర్నర్ తో డీ అంటే డీ అనేలా తలపడిన కేసీఆర్ ఇప్పుడు రూట్ మార్చారు. గవర్నర్ తో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు. ఎప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేలా గవర్నర్ , ముఖ్యమంత్రిలు ఒక్కసారిగా కలుపుగోలుగా మాట్లాడుకున్నారు. ఇందుకు రాజ్ భవన్ వేదికగా మారింది.
గురువారం పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో ముచ్చటించారు. తమ మధ్య గతంలో ఎలాంటి వివాదాలు లేవన్నట్లు వారు మాట్లాడుకున్నారు. వారెం మాట్లాడుకున్నారో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారలా మాట్లాడుకున్న ఒక్క రోజులోనే గవర్నర్ ను సచివాలయానికి కేసీఆర్ ఆహ్వానించారు. గతంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించకుండా అవమానించారని రచ్చ జరిగింది. ఇప్పుడు మాత్రం సచివాయాలనికి గవర్నర్ ను స్వయంగా కేసీఆర్ ఆహ్వానించారు.
సచివాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించారు. గవర్నర్ రావడానికి ముందే సచివాలయం ఎంట్రీ గేటు వద్ద నిల్చున్నారు. తాను స్వయంగా ఆమెను సచివాలయం లోపలికి ఆహ్వానించారు. ఆలయంలో పూజలు కంప్లీట్ కాగానే సచివాలయంలో సీఎంవో అధికారులు.. తన చాంబర్ కు తీసుకెళ్ళి సచివాలయం డిజైన్ చూపించారు. గవర్నర్ తో కేసీఆర్ అలా సఖ్యత మెయింటెన్ చేసిన కేసీఆర్ ను చూసి ఆయనలో సడెన్ గా ఈ మార్పు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ కేబినేట్ ఆమోదించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆమె ఆమోదం తెలపలేదు. అలాగే ఆర్టీసీ విలీనం వీళ్ళు విషయంలోనూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు కేసీఆర్ కు ముఖ్యం. అందుకే కేసీఆర్ గవర్నర్ తో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారని.. తరువాత గవర్నర్ తో యథాతథంగా తలపడుతారని అంటున్నారు.
Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కీలక నేతలు..?